ETV Bharat / state

రక్తంతో తడుస్తున్న రైలు పట్టాలు - dead body

ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లాలో రైలు పట్టాలు రక్తంతో తడుస్తున్నాయి. రోజుకో శవం పట్టాలపై కనిపిస్తోంది. వారం రోజుల్లోనే ఆరుగురు చనిపోయారు. పోలీసులు మాత్రం పట్టాలపై మరణాలను పట్టించుకోవడం లేదు.

రక్తంతో తడుస్తున్న రైలు పట్టాలు
author img

By

Published : Nov 16, 2019, 4:19 PM IST

రెండు రోజుల క్రితం 9వ తరగతి చదివే విద్యార్థి నెల్లూరు నగరంలో అనుమానాస్పదంగా రైలు పట్టాల వద్ద శవంగా కనిపించాడు. ఇంటి నుంచి వెళ్లిన అతడు శవమై కనిపించాడు. ఇది ఎలా జరిగింది?
ఆదివారం రాత్రి నెల్లూరు విజయమహల్‌ గేటు వద్ద బీటెక్‌ చదివే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్నేహితులతో కలసి బయటకు వెళ్లిన ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఎందుకు జరిగిందో వివరాలు బయటకు రాలేదు.
ఇటీవల ఒకేరోజు వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు రైలు పట్టాలపై చనిపోయి పడున్నారు. వీరిలో ఒక మహిళ, ఒక యువకుడు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అసలు వీరెందుకు మృతి చెందినట్లు, ఈ ఘటనలు ప్రమాదవశాత్తు జరిగాయా? లేదా ఆత్మహత్యలు చేసుకున్నారా అనేది ఇప్పటికీ తేలలేదు.
రోజూ జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో రైలు పట్టాలపై చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రాణాలు వదులుతున్నారు. రైల్వే పోలీసులు మాత్రం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు కేసులు నమోదు చేస్తున్నారు. వీటి వెనక ఉన్న కారణాలేమిటో మాత్రం తెలుసుకోలేకపోతున్నారు.

నిత్య ప్రమాదాలు
ఏపీలోని నెల్లూరు జిల్లాలో కావలి నుంచి తడ వరకు 144 కిలోమీటర్లు, అలాగే గూడూరు నుంచి వెంకటగిరి మీదుగా అక్కుర్తి స్టేషన్‌ వరకు 55 కిలోమీటర్ల మేర రైలు మార్గాలు ఉన్నాయి. మొత్తం 199 కిలోమీటర్ల మేర జిల్లాలో రైలుమార్గం వెళ్తుంది. పలుచోట్ల రహదారులను ఆనుకొని రైలు పట్టాలు ఉండగా, కొన్ని ప్రాంతాల్లో విడిగా ఉన్నాయి. పలు రాష్ట్రాలకు జిల్లా మీదుగా రైళ్లు వెళ్తుంటాయి. జిల్లాలో నెల్లూరు, కావలి, గూడూరు ప్రధాన స్టేషన్లుగా ఉన్నాయి. వీటి పరిధిలో జీఆర్పీఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటారు. అలాంటి ఇక్కడ నిత్యం రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందరో తమ ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరికొందరు ప్రమాదవశాత్తు మృతి చెందుతున్నారు. పట్టాలపై మృతదేహాలు కనిపించిన ప్రతిసారి రైల్వే పోలీసులు ప్రమాదాలుగా కేసులు నమోదు చేసుకుంటున్నారు. గుర్తుతెలియని రైలు ఢీకొని, రైలు నుంచి జారిపడి అని వివరాలు పొందుపరుస్తూ కేసులు రాస్తున్నారు. అంతేగానీ ఏం జరిగింది, ఎందుకు జరిగింది.. ఎలా జరిగిందనే వివరాలు తెలుసుకోవడంలో విఫలమవుతున్నారు. దీంతో కొన్ని కేసులు మిస్టరీగానే మిగిలిపోతున్నాయి.

ఎందుకిలా?

జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్న రైలు ప్రమాదాల కేసులు ఎక్కువగా రాత్రిళ్లు చోటు చేసుకుంటున్నాయి. అది కూడా కూడళ్లు, ప్రధాన సెంటర్లు, జన జీవనం ఉండే ప్రాంతాల్లోనే జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా నెల్లూరు నగరంలోనే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆత్మకూరు బస్టాండు నుంచి వేదాయపాలెం వరకు రాత్రిళ్లు రైలు పట్టాలపై అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటాయి. రౌడీ షీటర్లు సంచరిస్తుంటారు. దొంగతనాలు, దోపిడీలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా హత్యలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల గస్తీ అవసరం. నిత్యం నిఘా ఉండాల్సి ఉంది. కానీ ఏ ఒక్క స్టేషన్‌ పోలీసులు ఈ ప్రాంతంలో కనిపించడం లేదు.

దర్యాప్తు ఏది?
సాధారణంగా రైలు కిలోమీటరు దూరంలో ఉండగానే వస్తున్నట్లు తెలిసిసోతుంది. పట్టాలపై నిలబడితే వాటి కదలికతో రైలు వస్తుందనే సమాచారం తెలుస్తుంది. ఇన్ని అవకాశాలు ఉన్నా పట్టాలు దాటుతూ ప్రమాదవశాత్తు మరణించడంపై ఆలోచించాల్సి ఉంది. రైలు పట్టాలపై లభ్యమైన ప్రతి మృతదేహం విషయంలో ప్రమాదవశాత్తు జరిగిందనే రైల్వే పోలీసులు నమోదు చేసుకుంటారు. ఆదివారం 9వ తరగతి విద్యార్థి మృతి చెందితే 35 సంవత్సరాల వ్యక్తి మృతి చెందినట్లు నమోదు చేసుకున్నారు. ఆ విద్యార్థి తల్లిదండ్రులు గుర్తిస్తే తప్ప అసలు విషయం తెలుసుకోలేకపోయారు. దీన్నిబట్టి రైల్వే పోలీసుల దర్యాప్తు ఎలా ఉందో చెప్పకనే తెలుస్తోంది. అత్యధికంగా యువకులే రైలు పట్టాలపై మృత్యువాత పడుతున్నారు. వారి మృతి వెనక ఉన్న కారణాలు మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేయడం లేదు. ప్రమాదం జరిగినా ఎందుకు జరిగిందనే వివరాలు సేకరించడం లేదు. ఇలాంటి ప్రమాదాలపై ఉన్నతాధికారులు లోతుగా విచారిస్తే అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇవీ చూడండి: మాయమవుతున్న మానవత్వం..?

Intro:Body:

vadgfjklg 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.