హైదరాబాద్ పాతబస్తీ జంగంమేట్ ప్రాంతంలో తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మై నేషన్ రిటైల్ అవుట్లెట్ - హెచ్పీసీఐ పెట్రోల్ బంక్‌ను రాష్ట్ర హోం శాఖ మాత్యులు ఎండీ మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జైళ్లశాఖ డీజీ రాజీవ్ త్రివేది, జైళ్లశాఖ అధికారులు, స్థానిక కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటి వరకు తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా 19 పెట్రోల్ బంకులు లాభాలతో నడుస్తున్నాయని మహమూద్ అలీ తెలిపారు. 20వ బంకు పాతబస్తీలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. రానున్న నూతన సంవత్సరం చివరి డిసెంబర్ వరకు మరో 20 బంకులు ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి తెలిపారు. ఈ పెట్రోల్ బంకులలో నాణ్యమైన పెట్రోల్, డీజిల్ దొరుకుతుందని తెలిపారు.
ఖైదీలకు 12 వేల నుంచి 15 వేళ వరకు జీతం ఇవ్వబడుతుందని అలాగే వారిపై నిఘా ఉంటుందని పేర్కొన్నారు. నాణ్యత వల్లే పెట్రల్ బంకులు లాభాల్లో వెళుతున్నట్లు హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు.
ఇవీ చూడండి: పురపాలక ఎన్నికల షెడ్యూల్ విడుదల