స్వీయరక్షణ విద్య కరాటేకు పూర్వవైభవం రావాలని, అందుకు తన వంతుగా కృషి చేస్తానని యువ కథానాయకుడు విశ్వక్ సేన్ చెప్పారు. కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ప్యాట్రన్‌గా.. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని కరాటే రాజు నివాసంలో షోట్కాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో కరాటే రాజుకు సన్మానం చేశారు.
ప్రముఖ సినీ నిర్మాత సి. కళ్యాణ్‌తో పాటు అసోసియేషన్ సభ్యులు హాజరై రాజును సత్కరించారు. కరాటేరాజు సేవలను కొనియాడిన సి. కళ్యాణ్... విశ్వక్‌సేన్ కరాటేకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం ఏలుతోంది: కిషన్‌రెడ్డి