సమాజంలో పచ్చదనం పెరుగుదల కోసం ప్రజలు బాధ్యతగా కృషి చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ఆరో విడత హరితహారంలో భాగంగా తెరాస సీనియర్ నాయకులు కోకా రవీందర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బోలక్‌పూర్‌లో ఎమ్మెల్యే... ప్రజలకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షించాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైనగాలి అందించే దిశగా ప్రతి పౌరుడు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ మెంబర్, కార్పొరేటర్ ముఠా పద్మ నరేశ్, సీనియర్ నాయకులు ఎం నరేశ్ ముఠా జై సింహ తదితరులు పాల్గొన్నారు.
'మొక్కలు నాటుదాం... భావితరాలకు స్వచ్ఛమైన గాలి అందిద్దాం' - plantation program
హైదారాబాద్‌లోని బోలక్‌పూర్‌లో ఎమ్మెల్యే ముఠాగోపాల్ హరితహారం నార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్థానికులకు మొక్కలు పంపిణీ చేశారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కోరారు.