ETV Bharat / state

మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి పిలవకండి! - hyderabad corona

పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని గౌరవించుకునే గొప్ప భారతీయ సంప్రదాయం మనది. కానీ ఈ కరోనా మహమ్మారి కారణంగా బంధాలు ఎడబాయటమే కాదు, ఇంటికి ఎవరైనా వస్తే అనుమానంతో శత్రువుల్లా చూసే పరిస్థితి తలెత్తింది. మొహమాటంతో అక్కున చేర్చుకొని కరోనా కోరల్లో చిక్కుకునే బదులు.. మా ఇంటికి రాకండి, మీ ఇంటికి మమ్మల్ని రానివ్వకండి అంటూ నిర్మొమహమాటంగానే చెప్పేస్తున్నారు హైదరాబాద్ నగరంలోని ఓ కాలనీ వాసులు.

musheerabad colony people awareness on social distance
మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి పిలవకండి!
author img

By

Published : Jul 17, 2020, 6:39 PM IST

ఇంటికి ఎవరైనా అతిథి వస్తే.. గౌరవంగా ఆహ్వానించి.. మర్యాదలు చేస్తాం. కానీ.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మా ఇంటికి ఎవరూ రాకండి అనేలా కరోనా పరిస్థితుల్ని మార్చేసింది. ఇలా అనటం మర్యాద కాదని తెలిసినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సెల్ఫ్ లాక్ డౌన్ తప్పదంటున్నారు పట్నం వాసులు.

కరోనా మహమ్మారి అటు రాష్ట్రంలో.. ఇటు నగరంలో వేగంగా విస్తరిస్తోంది. వైరస్ బారినుంచి తమను తాము కాపాడుకోవటానికి కొందరు ఇంటికే పరిమితమై పనులు చక్కదిద్దుకుంటుండగా.. అనుకోని అతిథిలు ఇంటికి రావటం వల్ల అనుమానాస్పదంగా చూస్తున్నారు. వ్యాధి సోకిన వారిలో ఎక్కువగా లక్షణాలు లేని వారే ఉండటం, వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నవారు ఇళ్ల వద్దే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు . కానీ ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే హోం ఐసోలేషన్ లో ఉండాల్సిన 2200 కోవిడ్ పాజిటివ్ బాధితులు ఇష్టారీతిన రోడ్ల మీద తిరుగుతున్నారని, ప్రభుత్వ అధికారులకు సహకరించడం లేదని ఓ సర్వే నిగ్గుతేల్చింది.

ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్​పూర్ డివిజన్ పద్మశాలి కాలనీ వాసులు తమను తాము రక్షించుకునేందుకు వినూత్న ప్రచారంతో ఆలోచింపచేస్తున్నారు. కొవిడ్ ఆరంభంలో ఎన్నో సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచిన ఈ కాలనీ వాసులు... ప్రస్తుత పరిస్థితికి ఇళ్లలోంచి బయటకు రాకపోవటమే శ్రేయస్కరమంటున్నారు. మా ఇంటికి రాకండి, మీ ఇళ్లకు రానివ్వకండి అంటూ బోర్డులు, బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టి తమ ఇంటిలోకి ప్రవేశం నిషిద్ధం అని సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఈ నిబంధన మిత్రులు, బంధువులు, పరిచయం లేని వ్యక్తులందరికీ వర్తిస్తుందని చెప్తున్నారు.

ఇదీ చదవండి: సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.