ETV Bharat / state

' వ్యక్తి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం' - Murder At Chikkadapalli For Illegal Affair

హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కారణంతో సాగర్ అనే వ్యక్తిపై ప్రవీణ్ అనే అతను కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాల పాలైన సాగర్​ను ఆస్పత్రికి తరలిస్తుండగా అతను మృతి చెందాడు.

Chikkadpalli_Murder
Chikkadpalli_Murder
author img

By

Published : Feb 8, 2020, 2:14 PM IST

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో సాగర్​ అనే వ్యక్తిపై ప్రవీణ్​ అనే అతను కత్తితో దాడి చేసిన ఘటన నగరంలోని చిక్కడపల్లి పీఎస్​​ పరిధిలో చోటు చేసుకుంది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ సాగర్​ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

అర్టీసీ క్రాస్​రోడ్​ లోని ఓ కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా ప్రవీణ్ పనిచేశాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పనిచేసే చోట తోటివాడైన సాగర్​... ప్రవీణ్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు సాగర్​ది కర్ణాటకలోని గుల్బర్గా అని... అతని కుటుంబం కొద్ది నెలల క్రితమే హైదరాబాద్​కు వలస వచ్చిందని చెప్పారు.

అక్రమసంబంధం నెపంతో ఒకరిపై కత్తితోదాడి... వ్యక్తి మృతి

ఇదీ చూడండి: చెన్నైలో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ను బలిగొన్న పెళ్లి ఫ్లెక్సీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.