నీళ్ల కోసం జరిగిన వాగ్వాదం... ఇంటి యజమానిపై హత్యాయత్నానికి దారితీసింది. హైదరాబాద్ గోల్కొండ పరిధిలోని కాలనీలో కొన్ని రోజులుగా నీళ్ల కొరత ఏర్పడింది. అందరం కలిసి ట్యాంకర్లు తెప్పించుకుందామని ఇంటి యజమాని అద్దెదారులను కోరాడు. ఆ భవనంలోని ఆరు కుటుంబాలు ఇందుకు ఒప్పుకోగా... ఒక అద్దెదారు నిరాకరించాడు. అభ్యంతరం తెలిపిన కుటుంబాన్ని లాక్‌డౌన్ ముగిశాక ఇల్లు ఖాళీ చేయాలని యజమాని చెప్పాడు. ఖాళీ చేయమన్నందుకు యజమానిపై కోపం పెంచుకున్న ఆ అద్దెదారు తన స్నేహితులతో కలిసి ఇంటి యజమాని, అతని కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:'వలస కార్మికుల తరలింపులో చొరవ తీసుకోండి'