హైదరాబాద్ కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో తాగిన మత్తులో ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 8న అండాళామ్మ (47)పై తాగిన మైకంలో అత్యాచారం చేసి చంపి రవి (29) పరారయ్యాడు.
పోలీసులు దోబీఘాట్ వద్ద నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం దర్యాప్తులో రవి తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. దానితో అతని మీద కేసునమోదు చేసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు.
ఇదీ చూడండి: భర్త ఇంటి ఎదుట కొడుకుతో కలిసి భార్య నిరసన