EC on munugode By election: మునుగోడు ఉపఎన్నిక సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి వికాస్‌రాజ్ అన్నారు. ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్‌ల కోసం బ్యాలెట్ పేపర్‌ల ముద్రణ పూర్తయిందని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోటీలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో ఈవీఎం కమిషనింగ్ ప్రారంభమైందన్నారు.
35 శాతం అదనపు ఈవీఎంలు, వీవీ ప్యాట్లను రిజర్వ్ అధికారికి కేటాయించామని చెప్పారు. పోలింగ్ సిబ్బందికి 27, 28 రెండో విడత శిక్షణ ఇస్తామన్నారు. 25 శాతం రిజర్వ్‌తో పాటు అవసరమైన సంఖ్యలో పోలింగ్ సిబ్బందిని నియమించామని తెలిపారు. మునుగోడులో ఇప్పటి వరకు 12 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న రూ. 2 కోట్ల 49 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది 1483.67 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారని... పౌరులు ఎలాంటి లంచం తీసుకోకుండా ఉండాలని సూచించారు. ఎలాంటి ఫిర్యాదు అయినా టోల్ ఫ్రీ నంబర్ 08682230198తో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌కు తెలుపాలని కోరారు.
ఇవీ చదవండి: