ETV Bharat / state

పట్టణాల్లో వైరస్ కట్టడికి పురపాలకశాఖ ప్రత్యేక చర్యలు - పురపాలకశాఖ చర్యలు

రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పురపాలకశాఖ వెల్లడించింది. వ్యర్థాలను తరలింపునకు సిబ్బంది, వాహనాలను సమకూర్చుకోవాలని సూచించింది. సీఎం కేసీఆర్​ ఆదేశాలతో వైరస్ నియంత్రణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

Municipal special
పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు
author img

By

Published : May 8, 2021, 8:44 PM IST

కొవిడ్ రెండో దశ దృష్ట్యా పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సహా వైరస్‌ నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని పురపాలకశాఖ స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నియంత్రణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని తెలిపింది. పట్టణాల్లో ప్రతి రోజూ పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని.. అపరిశుభ్రంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపారు.

పట్టణాల్లో వ్యర్థాల తరలింపునకు సరిపడా సిబ్బంది, వాహనాలను సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో రసాయనాలు పిచికారీ చేయాలని.. దానికోసం సోడియం హైపోక్లోరైడ్ నిల్వలు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, చేతి గ్లౌజులు ఇవ్వాలని సూచించారు. శ్మశానవాటికల వద్ద మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాలని.. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.

ఇదీ చూడండి : మీటర్​ రీడింగ్ మీ చేతుల్లోనే.. టీఎస్-ఎన్​పీడీసీఎల్​ కొత్త యాప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.