ETV Bharat / state

పుర, నగరపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

రాష్ట్ర నగరపాలక, పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అభ్యర్థుల భవితవ్యం ఒక్కొక్కటిగా వెల్లడి కానుంది. కౌటింగ్ సజావుగా సాగేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 134 కేంద్రాల్లో 2వేల 559 టేబుళ్లు ఏర్పాటు చేశారు.

municipal elections counting started in telangana state
రాష్ట్ర పుర, నగరపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
author img

By

Published : Jan 25, 2020, 7:59 AM IST

రాష్ట్రంలో 9 నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంస్థల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సుమారు 10 వేల మంది సిబ్బంది కౌంటింగ్​లో పాల్గొన్నారు.

ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 134 కేంద్రాల్లో 2వేల 559 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్​ వద్ద ముగ్గురు సిబ్బంది కౌంటింగ్​ చేయనున్నారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియను 2వేల 958 మంది సూపర్​ వైజర్లు, 5వేల 756 మంది అసిస్టెంట్లు పర్యవేక్షించనున్నారు. మధ్యాహ్నం 12గంటల వరకు తొలి ఫలితం... సాయంత్రానికల్లా పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి.

వార్డుసభ్యుల పదవుల కోసం మొత్తం 12,948 మంది ఎన్నికల బరిలో నిలిచారు. పార్టీలపరంగా చూస్తే అధికార తెరాస నుంచి 2,975 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున 2,619 మంది, భాజపా నుంచి 2,321 మంది అదృష్టం పరీక్షించుకుంటున్నారు. తెలుగుదేశం తరపున 347 మంది, మజ్లిస్ నుంచి 297 మంది పోటీ చేశారు. సీపీఐ, సీపీఎంల నుంచి 180, 165 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఇతర పార్టీల అభ్యర్థులు 284 మంది కాగా... స్వతంత్రులు 3,760 మంది ఉన్నారు.

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.