ETV Bharat / state

పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకోవాలి: పురపాలక శాఖ - హైదరాబాద్​ తాజా వార్తలు

మార్చి నెలాఖరులోగా వందశాతం పన్నులు, పన్నేతర ఆదాయ లక్ష్యాలను చేరుకోవాలని పురపాలక శాఖ స్పష్టం చేసింది. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో ఆస్తిపన్ను, ఇతర పన్నులు సహా పన్నేతర ఆదాయాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని పూర్తిగా వసూలు చేయాలని తెలిపింది.

పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకోవాలి: పురపాలక శాఖ

author img

By

Published : Jan 29, 2021, 2:53 AM IST

మున్సిపాలిటీల్లో మార్చి నెలాఖరులోగా వందశాతం పన్నులు, పన్నేతర ఆదాయ లక్ష్యాలను చేరుకోవాలని పురపాలక శాఖ స్పష్టం చేసింది. ఆస్తి పన్ను, ఇతర పన్నులు సహా పన్నేతర ఆదాయాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని పూర్తిగా వసూలు చేయాలని తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని, అన్ని విభాగాల అధిపతులను ఇందులో భాగస్వామ్యుల్ని చేయాలని పేర్కొంది. వందశాతం పన్ను వసూళ్ల కోసం రోజువారీ లక్ష్యాలు విధించాలని, విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొంది.

ఎక్కువ మొత్తంలో బకాయిలు ఉన్న 500 మంది జాబితా రూపొందించి.. వారి విషయమై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, వారిని వ్యక్తిగతంగా కలిసి పన్నులు వసూలు చేయాలని సూచించింది. ప్రభుత్వ భవనాలకు సంబంధించి ఆయా శాఖలతో సమన్వయం చేసుకోవాలని, జిల్లా కలెక్టర్లను సంప్రదించాలని పురపాలక శాఖ తెలిపింది. డిఫాల్టర్ల జాబితాను వెబ్ సైట్లలో, నోటీసు బోర్డులపై పొందుపర్చాలని పేర్కొంది. ప్రతి సోమ లేదా బుధవారాల్లో పన్ను మేళాలు నిర్వహించాలని తెలిపింది. పన్ను, పన్నేతర ఆదాయాన్ని వందశాతం వసూలు చేసేలా అదనపు కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలని పేర్కొంది. ఈ మేరకు పురపాలక శాఖ సంచాలకులు సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి: 'సాగు సెగ' మధ్య పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.