ETV Bharat / state

నిధుల వేటలో రేటింగ్‌ బాట

రాష్ట్రంలో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు మౌలిక సదుపాయాల కల్పన కోసం సొంతంగా నిధులను సమకూర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. 12 నగరపాలక సంస్థలు, 8 పురపాలక సంఘాలు క్రెడిట్‌ రేటింగ్‌తో బాండ్ల ద్వారా రుణాలను సమీకరించుకోనున్నాయి. ఇప్పటి వరకూ క్రెడిట్‌ రేటింగ్‌ సాయంతో హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పలు విడతలుగా బాండ్లను వేలం వేస్తూ రుణాన్ని సమీకరించుకుంటోంది.

municipal corporations and municipalities are preparing the sector to raise their own funds In Telangana

author img

By

Published : Jan 27, 2021, 7:05 AM IST

ఇకమీదట ఆర్థిక క్రమశిక్షణ, నికరమైన రాబడులు, వంద శాతం పన్ను వసూలు వంటి అంశాల ప్రాతిపదికన రాష్ట్రంలోని మరో 12 నగరపాలక సంస్థలు, 8 పురపాలక సంఘాలు స్వతంత్రంగా క్రెడిట్ రేటింగ్‌ను రూపొందించుకోనున్నాయి. ఫిబ్రవరి నాటికి రేటింగ్‌ సిద్ధం చేసుకుని వచ్చే ఆర్థిక సంవత్సరంలో బాండ్లను వేలం వేయడం ద్వారా రుణాన్ని సమీకరించుకోనున్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఆర్థిక స్థితి, పరిపాలనా సంస్కరణలు, అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళిక, పన్నుల రాబడి, రాబడి అంచనాలు, ఆర్థికాభివృద్ధి, నిధుల వినియోగం, మౌలిక సదుపాయాలు, సహా వివిధ అంశాల ప్రాతిపదికన క్రిసిల్‌, ఐసీఆర్‌ఏ, ఫిచ్‌ వంటి స్వతంత్ర సంస్థలు క్రెడిట్‌ రేటింగ్‌ ఇస్తాయి.

ప్రభుత్వంపై ఆధారపడకుండా..

నగరపాలికలు, పురపాలక సంఘాలు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధుల సమీకరణకు ఈ ప్రక్రియ దోహదపడుతుంది. అభివృద్ధి పనులకు నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతంగానే సమకూర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.

మంత్రి కేటీఆర్‌ పర్యవేక్షణ

పురపాలక సంఘాలు పూర్తిగా ప్రభుత్వంపైనే ఆధారపడకుండా సొంతంగా నిధులను సమీకరించుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులకు నిర్దేశించారు. దీనిని ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పురపాలక సంఘాల ఆర్థిక నియంత్రణకు ఇది కీలకమని మంత్రి స్పష్టం చేశారు.

క్రెడిట్‌ రేటింగ్‌కు వెళ్తున్నవి

కార్పొరేషన్లు: కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, రామగుండం, బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్‌, మీర్‌పేట-జిల్లెలగూడ, బోడుప్పల్‌, పీర్జాదీగూడ, జవహర్‌నగర్‌, నిజాంపేట.

పురపాలక సంఘాలు: మహబూబ్‌నగర్‌, సూర్యాపేట, జగిత్యాల, సిద్దిపేట, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ.

ఇదీ చదవండి: కలెక్టర్‌ నివాసంలో తేనీటి విందు.. మంత్రి గంగుల హాజరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.