హుస్సేన్ సాగర్‌లోని చెత్తను సేకరించే యంత్రాన్ని తీసుకొచ్చినట్లు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ట్విట్టర్లో వెల్లడించారు. మనుషుల సహాయం లేకుండానే చెత్త సేకరిస్తుందని తెలిపారు.
యంత్రాన్ని ప్రయోగాత్మకంగా తీసుకొచ్చి పరిశీలిస్తున్నామని చెప్పారు. హెచ్ఎండీఏ డబ్ల్యూఆర్ఐ, దేశ్మీలతో కలిసి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యంత్రం మూడు రోజుల్లో ఒక టన్ను చెత్తను సేకరిస్తుందని తెలిపారు.
గ్లాస్, ఆల్కహాల్, వాటర్ బాటిల్స్, విరిగిపోయిన ప్లాస్టిక్ పదార్థాలు, మగ్లు, బకెట్లు, బొమ్మలు, బాక్స్‌లు, ఆటో మొబైల్ పరికరాలు, చాక్లెట్ రేపర్లు, చిప్స్, బిస్కట్, నమ్కిన్, పాన్‌మసాల పాకెట్స్ తొలగిస్తుందని పేర్కొన్నారు.
రబ్బర్, లెదర్, బూట్లు, చెప్పులు, పాల కవర్లు, సాక్స్‌లు, షాపింగ్ బ్యాగులు, థర్మాకోల్ లాంటి మరెన్నో.. ఈ యంత్రం సేకరిస్తుందని తెలిపారు. ఇటువంటి మరో ఆరు అందుబాటులోకి తీసుకొస్తామని అరవింద్ కుమార్ వెల్లడించారు.
ఇదీ చూడండి: ఇకపై అలా కుదరదు... ఓఆర్‌ఆర్‌పై 1200 సీసీ కెమెరాలు