ETV Bharat / state

ఐకియా జంక్షన్​ను సందర్శించిన పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి - ఐకియా జంక్షన్​ను సందర్శించిన పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి

హైదరాబాద్​లోని ఐకియా జంక్షన్​ వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్​కుమార్​ పరిశీలించారు. మరో వారం రోజుల్లో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

muncipal secretary aravindkumar spoke on hmda works
ఐకియా జంక్షన్​ను సందర్శించిన పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి
author img

By

Published : Apr 30, 2020, 9:30 PM IST

మరో వారం రోజుల్లో ఐకియా జంక్షన్​ వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను పూర్తి చేయాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్​కుమార్ అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ కాలపరిమితి ముగిసే నాటికి ఐకియా జంక్షన్ బ్యూటిఫికేషన్ పనులన్నీ పూర్తయి ఆ ప్రాంతం చూపరులకు కనువిందును కలిగించనుందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఐకియా జంక్షన్​ను సందర్శించిన ఆయన.. అక్కడ జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించారు. ఐటీ కారిడార్​ ప్రాధాన్యత దృష్ట్యా జంట నగరాల్లో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఐకియా జంక్షన్​ను అద్భుతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో హెచ్ఎండీఏ ఇంజనీరింగ్​, అర్బన్​ ఫారెస్ట్రీ యంత్రాంగం పనుల్లో నిమగ్నమైందని తెలిపారు.

లాక్‌డౌన్ సమయంలో పలుచోట్ల అభివృద్ధి పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఐటీకారిడార్​లో కీలకమైన వెయ్యి చదరపు మీటర్లలోపు స్థలంగా ఉన్న ఐకియా జంక్షన్​ను అద్భుతంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఐకియా జంక్షన్‌లో గ్రీనరీ బ్యూటిఫికేషన్​తోపాటు కాటన్ స్టీల్‌తో రూపొందించిన ఎలుగుబంటి కుటుంబం బొమ్మలతోపాటు భారీ పిల్లిని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రీనరీకి మరింత అందాన్ని తీసుకువచ్చేందుకు పది రాతిబొమ్మలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఇవీ చూడండి: ముందస్తు చర్యల వల్లే నియంత్రించ గలిగాం: తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.