ETV Bharat / state

పురపోరు డిసెంబర్​లోనైనా జరిగేనా...? - Muncipolls

పురపోరుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఎన్నికలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు తోసిపుచ్చినప్పటికీ... కొన్ని పట్టణాల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. పిటిషన్లు లేని పట్టణాల్లోనూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా సర్కార్ ఎలాంటి నిర్ణయానికీ రాలేదు.

పురపోరు డిసెంబర్​లోనైనా జరిగేనా...?
author img

By

Published : Nov 13, 2019, 5:51 AM IST

పురపోరు డిసెంబర్​లోనైనా జరిగేనా...?

కొన్ని మినహా రాష్ట్రంలోని పట్టణ ప్రాంత స్థానిక సంస్థల పాలకమండళ్ల గడువు జులై రెండో తేదీతో ముగిశాయి. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు అప్పుడే ప్రారంభించినప్పటికీ ఎన్నికల ప్రక్రియలో లోపాలు జరిగాయంటూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది. నూతన పురపాలక చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం... కార్పొరేషన్లు, మున్సిపాలిటీల సంఖ్యను భారీగా పెంచింది. పాత వాటితో పాటు కొత్త కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ కసరత్తును ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టాయి.

మరికొంత ఆలస్యమయ్యే అవకాశం

పురపాలక ఎన్నికలకు సంబంధించిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలను హైకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. ఇక వెంటనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని అంతా భావించారు. అయితే 70కి పైగా పురపాలికల్లో ఎన్నికల సంబంధిత ప్రక్రియలో తప్పులు దొర్లాయని, లోపాలున్నాయంటూ దాఖలైన పిటిషన్లు ఇంకా అలాగే ఉన్నాయి. అందుకు సంబంధించిన విచారణ ప్రక్రియ జరగడంతో పాటు న్యాయస్థానం నిర్ణయం రావాల్సి ఉంది. ఒక్కో చోట ఒక్కోరకమైన లోపాలు, తప్పిదాలు ఉన్నాయని, విచారణ జరగాలని పిటిషనర్లు అంటున్నారు. ఫలితంగా ఈ ప్రక్రియ మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

పిటిషన్ల వ్యవహారం తేలితేనే ఎన్నికలు...

వాస్తవానికి ప్రజాప్రయోజన వ్యాజ్యాలు తోసిపుచ్చిన వెంటనే మిగతా పిటిషన్ల వ్యవహారం కూడా తేలితే వెంటనే పురపాలక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. పిటిషన్ల వ్యవహారం ఇంకా తేలలేదు. పురపాలక ఎన్నికలపై దాఖలైన మరో రిట్ అప్పీల్ పిటిషన్​ను ఈ నెల 30న విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలన్నీ తొలగి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించి వివరాలు అందిస్తే ఆ వెంటనే ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం అంటోంది. పిటిషన్లలో ఉన్న వాటిని మినహాయించి మిగతా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే వెసులుబాటు ఉంది. సర్కార్ మాత్రం అన్నింటికీ ఒకేమారు ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఖాళీగా ఉన్న స్థానాల్లో ఉపఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం

వివిధ కారణాల వల్ల కొన్ని స్థానికసంస్థల పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటికి ఉపఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం అవసరమైన ముందస్తు కసరత్తును కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఓటర్ల జాబితాలు సిద్ధం చేయడంతో పాటు రిటర్నింగ్ అధికారుల నియామకం, పోలింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. ఈ స్థానాలకు ఉపఎన్నికల నిర్వహణ అంశాన్ని ఎస్ఈసీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. సర్కార్ సమ్మతి ఇస్తే అటు మున్సిపాలిటీలు, ఇటు స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఇవీ చూడండి: వాద్యాల ప్రదర్శనను తిలకించిన గవర్నర్​ తమిళిసై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.