ETV Bharat / state

టీఎన్జీవో హైదరాబాద్​ జిల్లా అధ్యక్షుడిగా ముజీబ్​ హుస్సేన్​ - హైదరాబాద్​ జిల్లా టీఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా ముజీబ్​ హుస్సేన్​

హైదరాబాద్ జిల్లా తెలంగాణ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా ముజీబ్ హుస్సేన్, కార్యదర్శిగా ప్రభాకర్ ఎన్నికయ్యారు. నాంపల్లిలో ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నిక పత్రాలను తెలంగాణ ఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి వారికి అందజేశారు.

హైదరాబాద్​ జిల్లా టీఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా ముజీబ్​ హుస్సేన్​
author img

By

Published : Oct 14, 2019, 10:39 PM IST

హైదరాబాద్​ జిల్లా తెలంగాణ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా నాలుగోసారి ఎన్నికైన ముజీబ్​ హుస్సేన్​, కార్యదర్శిగా ఎన్నికైన ప్రభాకర్​ను టీఎన్జీవో సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. హైదరాబాద్​ నాంపల్లిలోని ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గెలిచిన వారికి ధ్రువపత్రాలను టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారెం రవీందర్​ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో బాణాసంచా కాల్చుతూ, డప్పుల చప్పుళ్లతో గెలిచిన వారికి తోటి ఉద్యోగులు స్వాగతం పలికారు. టీఎన్జీవోస్ సంఘానికి హృదయం వంటిదైన హైదరాబాద్​ జిల్లాకు ముజీబ్​ హుస్సేన్ ఏకగ్రీవంగా ఎన్నికవడం అభినందనీయమని రవీందర్​ రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని కోరారు.

హైదరాబాద్​ జిల్లా టీఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా ముజీబ్​ హుస్సేన్​

ఇదీ చూడండి: ఉద్యోగుల సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తాం: సీఎం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.