ETV Bharat / state

ఏపీ పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై విచారణ వాయిదా - ఏపీ పరిషత్​ ఎన్నికలు అప్​డేట్స్

ఏపీ పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై విచారణ ఆగస్టు 4కి వాయిదా పడింది. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ ముందు అప్పీల్​కు వెళ్లింది.

ap high court
ఏపీ హైకోర్టు
author img

By

Published : Jul 28, 2021, 11:03 PM IST

ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఆగస్టు 4న విచారణ చేపడతామని ఆ రాష్ట్ర హైకోర్టు తెలిపింది. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ ముందు అప్పీల్​కు వెళ్లింది. అప్పీల్​పై ఇవాళ విచారణ చేయాలని ధర్మాసనాన్ని కోరగా ఆగస్టు నాలుగున వింటామని తెలిపింది. పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని గతంలో సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు.

ఏపీ పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్‌ జడ్జి గతంలో తీర్పు చెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్‌ లేదని ఆక్షేపించారు. పోలింగ్‌కు 4 వారాల ముందు నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న ఆదేశాలను పాటించలేదని.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది ఏప్రిల్‌ 1న నోటిఫికేషన్‌ ఇచ్చి.. అదే నెల 7న పరిషత్‌ ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్‌కు 4 వారాల ముందు నోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదంటూ తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సహా జనసేన, భాజపా నేతలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇదీ చదవండి: వేలాది జింకలు ఒకేసారి రోడ్డు దాటడం ఎప్పుడైనా చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.