ETV Bharat / state

రఘురామపై సీఐడీ చర్యలను ఖండించిన మహిళా ఎంపీలు - mp raghurama case

సీఐడీ అధికారులు తనను కస్టడీలో హింసించారంటూ ఎంపీ రఘురామ(MP Raghu Rama) రాసిన లేఖకు పలువురు మహిళా ఎంపీలు ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు అభిప్రాయపడ్డారు.

mps-condemned-attack-by-ap-cid-on-mp-raghurama-in-police-custody
రఘురామపై సీఐడీ చర్యలను ఖండించిన మహిళా ఎంపీలు
author img

By

Published : Jun 5, 2021, 9:17 AM IST

ఏపీ సీఐడీ కస్టడీలో పోలీసులు హింసించారంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు(MP Raghu Rama) రాసిన లేఖపై.. పలువురు ఎంపీలు ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన మహిళా ఎంపీలు స్పందించారు. ఎంపీ రఘురామకృష్ణరాజు(MP Raghu Rama)పై కస్టడీలో థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడంపై తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, నమ్మలేకపోతున్నానని.. మాండ్య ఎంపీ సుమలత తెలిపారు.

దీనిపై తక్షణమే తగిన చర్యలు తీసుకోకపోతే.. ఇది ఏపీ ప్రభుత్వం, పోలీసులపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజును హింసించిన విషయం చదివి దిగ్భ్రాంతికి గురయ్యానని.. శివసేన లోక్‌సభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది అన్నారు. తమ ట్వీట్‌లకు రఘురామకృష్ణరాజు రాసిన లేఖను వారు జత చేశారు.

రఘురామపై సీఐడీ చర్యలను ఖండించిన మహిళా ఎంపీలు

ఇవీ చదవండి: మార్క్‌ఫెడ్‌ అడగదు... ప్రభుత్వం చెప్పదు.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.