ETV Bharat / state

సీబీఐ అధికారులకు ఏపీ ఎంపీ అవినాష్​ రెడ్డి లేఖ - ys vivek murder case latest news

MP YS Avinash Reddy letter to CBI : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఈ రోజు సాయంత్రం 3గంటలకు కడప ఎంపీ అవినాష్​రెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆయన సీబీఐకి లేఖ రాశారు. ఆ లేఖలో ఏముందంటే..?

Kadapa MP Avinash Reddy
కడప ఎంపీ అవినాష్​రెడ్డి
author img

By

Published : Jan 28, 2023, 1:40 PM IST

MP YS Avinash Reddy letter to CBI : వివేకా హత్య కేసులో తన ప్రతిష్ఠ దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందంటూ.. ఆంధ్రప్రదేశ్​లోని కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం జరగకుండా చూడాలని కోరారు. వివేకా హత్య కేసు విచారణ పారదర్శకంగా జరగాలని, సీబీఐ విచారణను రికార్డ్ చేసేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. తనతో పాటు ఓ న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చి.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు..

వైఎస్ విజయమ్మతో భేటీ.. అంతకముందు లోటస్​పాండ్​కు వెళ్లినట్లు వైఎస్​ అవినాష్​ తెలిపారు. అక్కడ వైఎస్​ విజయమ్మతో కలిసి మాట్లాడినట్లు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ విచారణకు హాజరవుతున్నట్లు అవినాష్‌రెడ్డి వెల్లడించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.