ఇటీవల కేంద్రం ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనలను మారుస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తప్పుపట్టారు. ఈ విషయంపై కేంద్రం అన్ని రాష్ట్రాలకు ముందుగానే సమాచారం ఇస్తే బాగుండేదన్నారు. రక్షణశాఖకు బడ్జెట్ సరిపోకపోవడమనే విషయం లేదని, కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులనే భద్రతా దళాలు పూర్తిగా వినియోగించట్లేదని తెలిపారు. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకోసం ఈ నియమ నిబంధనలను మార్చారో తెలపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రస్తుతం అప్పుల రాష్ట్రంగా ఉన్నప్పటికీ... ప్రాజెక్టులు వినియోగించుకొని రైతుల జీవితాలు బాగు పడితే... రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: లారీ యజమానికి రూ.6.53 లక్షలు జరిమానా