ETV Bharat / state

'కాజీపేటలో రైల్వే కోచ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలి' - కాజీపేటలో రైల్వే కోచ్ పరిశ్రమ ఎర్పాటుపై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందన

హైదరాబాద్‌-విజయవాడ రహదారి వెంట రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఎంపీ ఉత్తమ్​ కుమార్ రెడ్డి తెలిపారు. కాజీపేటలో రైల్వే కోచ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్‌ చర్చలో పలు అంశాలు లేవనెత్తినట్లు ఉత్తమ్‌ వివరించారు.

uttham kumar reddy in railway budget speech
'కాజీపేటలో రైల్వే కోచ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలి'
author img

By

Published : Mar 13, 2020, 12:49 PM IST

కాజీపేటలో రైల్వే కోచ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు పీసీసీ చీఫ్​, ఎంపీ ఉత్తమ్​కుమార్ రెడ్డి తెలిపారు. రైల్వే కోచ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని... అందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్‌ చర్చలో పలు అంశాలు లేవనెత్తినట్లు ఉత్తమ్‌ వివరించారు. కనీసం పీపీపీ పద్ధతిలోనైనా కోచ్ పరిశ్రమ నిర్మించాలని డిమాండ్ చేసినట్లు వివరించారు. హైదరాబాద్‌-విజయవాడ రహదారి వెంట రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని... అలా చేస్తే ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. 2 రాజధానుల మధ్య హైస్పీడ్ రైలు వేస్తే 2 గంటల్లో ప్రయాణం పూర్తవుతుందని తెలిపారు.

హైదరాబాద్‌-విజయవాడ బుల్లెట్ రైలు ఏర్పాటును కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బుల్లెట్ రైలు నడిపిస్తే ఆర్థికంగా కూడా లాభదాయకంగా ఉంటుందని... జగ్గయ్యపేట-మిర్యాలగూడ మార్గంలో గూడ్స్ రైలు నడుస్తోందని తెలిపినట్లు వెల్లడించారు. ఆ మార్గంలో ప్యాసింజర్ రైలును కూడా నడపాలని, హైదరాబాద్‌ను అత్యంత వేగవంత ట్రాక్ నిర్మాణ ప్రాజెక్టుల్లో చేర్చాలని కోరినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

'కాజీపేటలో రైల్వే కోచ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలి'

ఇవీ చూడండి: పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మార్చేస్తున్నాం: కేసీఆర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.