ETV Bharat / state

సీఎం కేసీఆర్‌కు అద్భుతమైన కానుక.. మొక్కలపై పక్షుల గూళ్లు - తెలంగాణ వార్తలు

కోటి వృక్షార్చనలో నాటిన మొక్కలు పెరిగి, పెద్దవై పక్షులు, కీటకాలకు ఆవాసాలవుతున్నాయి. ఆ చెట్లపై పక్షులు గూళ్లను ఏర్పరుచుకున్నాయి. ఇది హరితహారం రూపకర్త సీఎం కేసీఆర్​కు ఓ గొప్ప కానుక అని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. అందుకు సంబంధించిన ఫొటోను ట్వీట్​​కు జతచేశారు.

mp santhosh, cm kcr
ఎంపీ సంతోష్, సీఎం కేసీఆర్​కు బహుమతి
author img

By

Published : Jun 25, 2021, 7:21 AM IST

కోటి వృక్షార్చనలో భాగంగా నాటిన మొక్కలపై పక్షులు గూళ్లను ఏర్పరుచుకోవడం హరితహారం రూపకర్త సీఎం కేసీఆర్‌కు అద్భుతమైన కానుక అని ఎంపీ సంతోష్‌కుమార్‌ గురువారం ట్విటర్‌లో తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోను తన ట్వీట్‌కు జతచేశారు. కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా గత ఫిబ్రవరి 17న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఆధ్వర్యంలో సంతోష్‌ పిలుపుతో కోటి వృక్షార్చన కార్యక్రమం జరిగింది.

పచ్చిన చెట్టుపై పక్షి గూడు

ఈ సందర్భంగా భూపాలపల్లిలో సింగరేణి సంచాలకుడు బలరామ్‌ మియావాకి పద్ధతిలో తక్కువ ప్రదేశంలో చిన్న అడవిని సృష్టించేలా మొక్కలు నాటారు. అవి పెరిగి పెద్దవై పక్షులకు, కీటకాలకు ఆవాసంగా మారాయని సంతోష్‌ వెల్లడించారు.

ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం ఏడో విడత వచ్చే నెల ఒకటవ తేది నుంచి ప్రారంభం కానుంది. పల్లెప్రగతి, పట్టణప్రగతితో కలిపి ఈసారి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇప్పటికే ప్రకటించారు. ఏడో విడత హరితహారంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ దఫాలో రహదారుల వెంట బహుళ దశల్లో వనాలను అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని రకాల రహదారుల వెంట పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

ఇదీ చదవండి: కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసం సమగ్ర సర్వే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.