ETV Bharat / state

ఆ జవాన్ కుటుంబాన్ని ఆదుకోకుండా అవమానించొద్దు: రేవంత్ - revanth reddy about jawan family

దేశం కోసం ప్రాణాలు అర్పించిన షాహీద్ లాన్స్ నాయక్​ ఫిరోజ్​ ఖాన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2013లో ప్రాణాలు విడిచిన జవాన్ కుటుంబాన్ని ఇప్పటికీ ఆదుకోకపోవడం వారికి తీవ్ర అవమానమని ట్వీట్ చేశారు.

mp revanth reddy tweet about shaheed lance naik feroze khan family
'ఇప్పటీకి వారిని ఆదుకోలేదంటే... మీరు వారికి చేసిన అవమానమే'
author img

By

Published : Jun 23, 2020, 1:13 PM IST

2013వ సంవత్సరం బక్రీద్ పండుగ ముందు రోజు పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో జమ్ముకశ్మీర్​లో విధులు నిర్వర్తిస్తున్న షాహీద్ లాన్స్ నాయక్​ ఫిరోజ్​ఖాన్ మృతి చెందాడు. అతని కుటుంబానికి ప్రభుత్వం రెండు వందల గజాల స్థలం, 30 లక్షల రివార్డును ప్రకటించింది. ఏడు సంవత్సరాలు గడుస్తున్నా వారికి ఆ గౌరవం దక్కనే లేదు. ఇటీవలే కల్నల్ సంతోష్​ బాబుకు కుటుంబానికి సాయం చేసిన ప్రభుత్వం తమను ఎందుకు ఆదుకోవట్లేదు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

దీనిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. 2013వ సంవత్సరంలో ప్రాణాలు విడిచిన జవాన్​ కుటుంబాన్ని ఇప్పటికీ ఆదుకోకపోవడం వారికి చేసిన అవమానమేనని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ట్వీట్ చేశారు.

ఇవీ చూడండి: పుల్వామాలో ఎన్​కౌంటర్​- ఇద్దరు ముష్కరులు హతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.