జీహెచ్ఎంసీలో గతంలో మిగులు బడ్జెట్ ఉండేదని... ఇప్పుడు లోటు బడ్జెట్‌లో ముందుకు వెళుతోందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇంటిపన్నుతో పాటు ప్రభుత్వ ప్రాపర్టీ మీద 102 కోట్ల పన్నులు రావాలని అది రాబట్టకపోవడం వల్లే జీహెచ్‌ఎంసీ అప్పులబారిన పడిందని జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో తెలిపారు. రావాల్సిన పన్నుల మీద కమిషనర్, సీఎస్ ఎందుకు దృష్టిపెట్టడం లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ఇష్టం వచ్చినట్లు భవనాలకు అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు.
అత్యధిక జనాభా ఉన్న పాతబస్తీలో ఎందుకు మెట్రో నిర్మాణం చేపట్టడం లేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. అత్యల్పంగా 8 రూపాయలు, అత్యధికంగా 19 రూపాయలు ఉండాల్సిన మెట్రో ఛార్జీని అత్యత్పంగా 10కి, అత్యధికంగా 60 రూపాయలకు పెంచి ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీలో పెంచిన పన్నులను తగ్గిస్తామని గతంలో మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినప్పటికీ... అది నెరవేరలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ఇవీ చూడండి: మహబూబాబాద్ జిల్లాలో నిర్భయ తరహా ఘటన...