ETV Bharat / state

'డివిజన్ల పునర్విభజన, ఓట్లు చేర్పించడంపై జాగ్రత్తగా ఉండాలి'

భాగ్యనగరంలో డివిజన్ల పునర్విభజన, ఓట్లు చేర్పించడంపై సరైన దిశలో కాంగ్రెస్ పోరాటం చేయాల్సి ఉందని ఎంపీ రేవంత్‌ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమ్​ఐఎమ్ పునర్విభజన బోగస్ ఓట్లతో గెలవాలని చూస్తుందని విమర్శించారు. డీలిమిటేషన్ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

mp revanth reddy said redistribution of hyderabad divisions inclusion of votes should be care
'డివిజన్ల పునర్విభజన, ఓట్లు చేర్పించడంపై జాగ్రత్తగా ఉండాలి'
author img

By

Published : Sep 8, 2020, 9:37 PM IST

హైదరాబాద్‌ నగరంలోని డివిజన్ల పునర్విభజన, ఓట్లు చేర్పించడంపై సరైన దిశలో కాంగ్రెస్ పోరాటం చేయాల్సి ఉందని ఎంపీ రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎమ్​ఐఎమ్ పునర్విభజన బోగస్ ఓట్లతో గెలవాలని చూస్తుందని ఆరోపించారు. ఇందిరాభవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రేటర్ ఎన్నికల వ్యూహంపై చర్చించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. డివిజన్ల పునర్విభజన అంటే మొత్తం జనాభా డివైడెడ్ బై సీట్లు ఉండేటట్లు చూడాలన్నారు. కానీ ఇక్కడ అడ్డగోలుగా చేశారని అన్నారు. పాతబస్తీలో 15 నుంచి 30 వేల ఓట్లు ఉంటే.. ఇంకో చోట 70 నుంచి 80 వేలు ఉండేటట్లు చేశారని కాంగ్రెస్‌ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది.

టీమ్ సిద్ధంగా ఉండాలి

డీలిమిటేషన్ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. హైదరాబాద్ మేయర్ పదవిని బీసీ ఉమెన్‌కు రిజర్వ్ చేసినట్లు పేర్కొన్న ఎంపీ.. మళ్లీ డివిజన్లు ఏమైనా మారుస్తారేమో అన్నది పరిశీలించాలన్నారు. ఎన్నికల సమయంలో లీగల్‌గా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుకోడానికి లీగల్ టీమ్ సిద్ధంగా ఉండాలని సూచించారు. 150 డివిజన్లలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు, యువకులను గుర్తించి గడప గడపకు పాదయాత్ర చేసి వాళ్లను నామినేట్‌ చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

పలువురు హాజరు

ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, నగర అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, ఎంపీ రేవంత్ రెడ్డి, నాయకులు వి.హెచ్, మర్రి శశిధర్ రెడ్డి, కొండ విశ్వేశ్వర్​ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, కుసుమ కుమార్, దామోదర్ రాజా నర్సింహ, పొన్నం ప్రభాకర్, దాసోజు శ్రవణ్‌లతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : 'కేసీఆర్ అసెంబ్లీని ఫామ్ హౌస్​లో పెట్టుకుంటే బాగుంటుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.