ETV Bharat / state

RRR on YCP: 'ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైకాపాకు ఎన్నిసీట్లు వస్తాయంటే..?' - ap news

వైకాపా, కొందరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, వైకాపా 50 సీట్లకే పరిమితమవుతుందన్నారు. నరసాపురంలో సీఎం జగన్‌ పోటీ చేస్తే... ఆయన కంటే 19 శాతం ఆధిక్యం తనకే లభిస్తుందన్నారు.

mp raghurama
mp raghurama
author img

By

Published : Aug 23, 2021, 6:55 PM IST

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, వైకాపా 50 సీట్లకే పరిమితమవుతుందని.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఐవీఆర్​ఎస్​ (IVRS) పద్ధతిలో తాను చేయించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందన్నారు. నరసాపురంలో సీఎం జగన్‌ పోటీ చేస్తే... ఆయన కంటే 19 శాతం ఆధిక్యం తనకే లభిస్తుందన్నారు. జిల్లాల వారీగా జయాపజయాల వివరాలు ఈ సర్వేలో వెల్లడైనట్లు రఘురామ చెప్పారు.

వైకాపా, కొందరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏమవుతుందో సర్వేలో తెలిసింది. చిత్తూరులో చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, చంద్రబాబుకు 60 శాతం ప్రజల మద్దతు ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో నేతలు ప్రజల మద్దతు పొందలేకపోతున్నారు. గ్రంధి శ్రీనివాస్‌కు మాత్రమే 50 శాతం పాజిటివిటీ ఉంది. కొందరు చేసే తప్పుడు ప్రచారం ఆపేందుకే తన సర్వే వివరాలు వెల్లడించా.- రఘురామ, నరసాపురం ఎంపీ

మాజీ మంత్రి వివేకాకు గుండెపోటు వచ్చిందని విజయసాయిరెడ్డికి ఎవరు చెప్పారో తెలియాలని రఘురామ డిమాండ్ చేశారు. సీబీఐ ముందుగా విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలన్నారు. విషయం మార్చి చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉందో తెలియాలన్నారు.

నాసిరకం మద్యంపై కేంద్రమంత్రి మన్‌సుఖ్‌కు లేఖ రాశానని ఎంపీ రఘురామ స్పష్టం చేశారు. అమరరాజా కంపెనీలో కాలుష్యం గురించి మాట్లాడే నేతలు.. ప్రభుత్వ మద్యం వల్ల పాడవుతున్న ప్రజల ఆరోగ్యం గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం వల్ల ఎంత మంది కాలేయం దెబ్బతిన్నదో... అమరరాజ సంస్థ వల్ల ఎంత మందికి దెబ్బతిన్నదో వివరాలు సేకరిస్తే నిజాలు బయటికి వస్తాయన్నారు.

'ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైకాపాకు ఎన్నిసీట్లు వస్తాయంటే..?'

ఇదీ చూడండి: tarun chugh: రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.