ETV Bharat / state

MP NAMA: 'టీకా ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నా.. వ్యాక్సినేషన్​లో వెనకబడ్డాం' - mp nama raised questions on vaccination in loksabha

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నాలుగు రోజులుగా కొనసాగుతున్నాయి. ఉభయసభల్లో వాడివేడి చర్చలతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. కాగా ఈ రోజు లోక్​సభలో జరిగిన చర్చల్లో దేశంలో కరోనా వ్యాక్సినేషన్​ ప్రక్రియపై కేంద్ర మంత్రిని ఖమ్మం ఎంపీ, తెరాస లోక్​సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు పలు ప్రశ్నలు అడిగారు. దేశంలో టీకాల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడానికి కేంద్రం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు.

mp nama in parliament
పార్లమెంటులో ఎంపీ నామ
author img

By

Published : Jul 23, 2021, 6:02 PM IST

Updated : Jul 23, 2021, 6:54 PM IST

కొవిడ్​ వ్యాక్సినేషన్ తయారీలో ప్రపంచంలోనే భారత్​ అగ్రస్థానంలో ఉన్నా.. టీకాల ప్రక్రియ మాత్రం నత్తనడకన కొనసాగుతోందని తెరాస ఎంపీ నామ నాగేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 10 శాతం మంది మాత్రమే మొదటి డోసు తీసుకున్నారని.. దానికి గల కారణాలను తెలపాలని లోక్​సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతి ప్రవీణ్​ పవార్​ స్పందించారు. నామ వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. ఈ నెల 20 వరకు దేశంలో 18 సంవత్సరాల వయసు పైబడిన వారిలో 34.5 శాతం మంది మొదటి డోసు వ్యాక్సిన్​ వేయించుకున్నారని తెలిపారు.

నామ ప్రశ్నల పరంపర

ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొదటి, రెండు డోసులు వేయించుకున్నవారి సంఖ్య, కరోనా టీకా కేంద్రాలపై కేంద్ర మంత్రిని నామ వివరణ అడిగారు. టీకాల కొరతతో చాలా వరకు వ్యాక్సినేషన్​ కేంద్రాలు మూసి ఉంటున్నాయని.. అవి తిరిగి అందుబాటులోకి ఎప్పుడు వస్తాయని ప్రశ్నించారు. ప్రజల్లో టీకాపై అవగాహన, వ్యాక్సిన్ల సరఫరా పెంచేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని కేంద్రాన్ని అడిగారు. అత్యవసర పరిస్థితుల్లో విదేశాల్లో తయారయ్యే వ్యాక్సిన్ల వినియోగంపై వివరణ కోరారు.

వ్యాక్సిన్​ కొరత లేదు

ఎంపీ నామ ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. ఈ నెల 20 లోగా దేశ వ్యాప్తంగా వ్యాక్తిన్​ అర్హత ఉన్నవారిలో 32.64 కోట్ల మంది మొదటి డోసు, 8.55 కోట్ల మంది రెండో డోసు వేసుకున్నారని వివరించారు. మొత్తం 2.15 లక్షల కేంద్రాల్లో వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. దేశంలో వ్యాక్సిన్​ కొరత లేదని.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగానే వ్యాక్సిన్​ సరఫరా చేస్తున్నామని మంత్రి సమాధానమిచ్చారు. ఆయా రాష్ట్రాలకు కేటాయింపుల ప్రకారం 15 రోజుల ముందుగానే సరఫరా చేస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వం​ మద్దతు

ఇక టీకాల కోసం విదేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా.. దేశీయంగా ఉత్పత్తి చేయడానికే భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి అన్నారు. కొవిడ్​-19 సురక్ష మిషన్​లో భాగంగా టీకాల ఉత్పత్తికి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. కొవాగ్జిన్​ ఉత్పత్తిలో భారత్​ బయోటెక్​కు సాంకేతికంగా, మరో వ్యాక్సిన్​ తయారీ సంస్థకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. భారత్​ బయోటెక్​, సీరమ్​ ఇన్​స్టిట్యూట్​తో పాటు మరో రెండు ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వం​ తన మద్దతు ఇస్తోందని వివరించారు.

ఇదీ చదవండి: telangana floods: మత్తడి దూకుతున్న చెరువులు.. జనావాసాలు జలమయం...

Last Updated : Jul 23, 2021, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.