MP Nama Fire on Central Govt: సింగరేణి ప్రైవేటుపరం చేయబోమని చెప్పి ఇప్పుడు కేంద్రం బ్లాకులు వేలం వేయడానికి సిద్ధపడుతోందని టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వర రావు ధ్వజమెత్తారు. సింగరేణి వాటలో కేంద్రానికి ఉన్న 49 శాతం వాటా రాష్ట్రం తీసుకుంటుందని చెప్పినా కేంద్రం ఒప్పుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
తెలంగాణ పట్ల కేంద్రం చిన్న చూపు చూస్తోందని విమర్శించిన ఆయన.. విధాన పరమైన నిర్ణయంతో వేలం వేశామని కేంద్రం అంటుండడం విడ్డురంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు తీసుకునేలా కేంద్రం చట్టం తీసుకురావడం చాలా బాధాకరమని అన్నారు. ఇకనైనా రాష్ట్ర అంశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలిని నామ సూచించారు.
ఇవీ చదవండి: