ETV Bharat / state

తెలంగాణకు రావాల్సిన పెండింగ్​ నిధులు విడుదల చేయాలి: నామ

author img

By

Published : Mar 18, 2021, 9:02 PM IST

తెలంగాణలో వివిధ పెండింగ్​ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన​ నిధులను సత్వరమే విడుదల చేయాలని ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్​సభలో సప్లిమెంటరీ డిమాండ్స్​ ఫర్​ గ్రాంట్స్​పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

MP nama asked the central government to release the pending funds to the telangana
రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్​ నిధులు విడుదల చేయాలి: నామ

వివిధ పెండింగ్​ ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సుమారు రూ.3 వేల కోట్ల పెండింగ్​ నిధులను సత్వరమే విడుదల చేయాలని తెరాస లోక్​సభా పక్షనేత, ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్​సభలో సప్లిమెంటరీ డిమాండ్స్​ ఫర్​ గ్రాంట్స్​పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

ఈ పెండింగ్​ నిధుల విడుదల, పెండింగ్​ ప్రాజెక్టుల పూర్తికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రి కేటీఆర్​, ఇతర మంత్రులు, తాను ఎన్నోసార్లు రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఎంపీ పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆ నిధులను విడుదల చేయాలన్నారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేసి, మద్దతుగా నిలవాలని కోరారు.

ఈ సందర్భంగా కొవిడ్ కారణంగా ఒక సంవత్సరం నుంచి కష్టాలు ఎదుర్కొంటూ ఇప్పుడిప్పుడే బయట పడుతున్నామని నామ అన్నారు. రాష్ట్రాల్లో రోడ్లు, నేషనల్​ హైవేలు వంటి మౌళిక వసతులు అభివృద్ధి జరగాలన్నారు. అప్పుడే మరింత అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్యానించారు. కొన్ని రాష్ట్రాలు కేంద్రం కేటాయించిన నిధులను ఖర్చు చేయడం లేదని.. అలాంటి నిధులను తెలంగాణకు కేటాయించాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని కోరారు.

ఇదీ చూడండి: 'అంకెలు బారెడు... అప్పులు బోలెడు'.. బడ్జెట్​పై విపక్షాల విమర్శలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.