ETV Bharat / state

MP Laxman Latest Comments : 'తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్​ వస్తుంది' - ఎంపీ లక్ష్మణ్​ ప్రెస్​మీట్

MP Laxman Fire on KCR : మహా జన్ సంపర్క్ అభియాన్​లో భాగంగా నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలన ప్రగతి నివేదిక ప్రజల ముందు ఉంచుతున్నామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ తెలిపారు. రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి బీజేపీకి తప్పా ఏ పార్టీకీ లేదన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావడం ఖాయమని అన్నారు.

MP Laxman Latest Comments
MP Laxman Latest Comments
author img

By

Published : Jul 11, 2023, 7:31 PM IST

Updated : Jul 11, 2023, 7:53 PM IST

బీఆర్​ఎస్​ని ఎదుర్కొనేది బీజేపీనే అన్న ఎంపీ లక్ష్మణ్

MP Laxman Latest Comments on BRS : రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి చేరిందని.. దేశంలోనే అవినీతి ప్రభుత్వం బీఆర్​ఎస్​దేనని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్​ ఆరోపించారు. రాష్ట్రంలో డబుల్​ ఇంజిన్​ సర్కార్​ వస్తుందని తెలిపారు. మహాజన్​ సంపర్క్​ అభియాన్​లో భాగంగా నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలన ప్రగతి నివేదికను ప్రజల ముందు ఉంచారని అన్నారు. రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి బీజేపీకి తప్పా ఏ పార్టీకి లేదని చెప్పారు. దక్షిణాదిలో అనేక పర్యాయాలు కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని.. అలానే తెలంగాణలో కూడా అధికారంలోకి తీసుకువచ్చేందుకే కృషి చేస్తారని పేర్కొన్నారు. దీనికోసమే జాతీయ నాయకత్వం ప్రకాష్​ జవదేకర్​ను రాష్ట్ర ఎన్నికల ఇంచార్జీగా, సునీల్​ బన్సల్​ను సహా ఇంచార్జీగా నియమించారని గుర్తు చేశారు.

BRS is a Corrupt Government : వరంగల్​లో ప్రధాని పర్యాటన తరవాత అధికారంలోకి వస్తామనే విశ్వాసం కలిగిందని చెప్పారు. తెలంగాణలో డబుల్​ ఇంజిన్​ సర్కార్​ రావడం ఖాయమని అన్నారు. తెలంగాణలో అవినీతి తారాస్థాయికి పెరిగిపోయిందని ఆరోపించారు. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బహిరంగంగా కడియం శ్రీహరి దోచుకున్నారని ఆరోపిస్తే.. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పందించలేదని అన్నారు. కాంగ్రెస్​ మళ్లీ బీఆర్ఎస్​ గూటికే వెళుతుందని ఎద్దేవా చేశారు. అన్ని రాష్ట్రాల సీఎంలు కేంద్ర అభివృద్ధి పనుల్లో భాగస్వాములు అవుతున్నారని.. అవినీతి వల్లే కేసీఆర్‌, ప్రధానికి ముఖం చాటేస్తున్నారని విమర్శించారు.

BJP Plan for TS assembly elections : గ్రామస్థాయి నుంచి చేరికలపై దృష్టి.. 100 రోజుల ప్రణాళిక సిద్ధం

MP Laxman Fire on Congress : దళితబంధు పథకంలో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని.. ఒకరి అవినీతిని ఒకరు బయట పెట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వ సొమ్ముతో పార్టీ ప్రచారం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ ఏమైందని.. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని మాట తప్పి మోసం చేశారని అన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి కనీస మానవత్వం లేదని విమర్శించారు. కాంగ్రెస్​ నాయకులు మాటలు మార్చుతారని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు అంటే, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రెడ్డి 24గంటలు ఇస్తామంటున్నారని మండిపడ్డారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ వేరుకాదని అన్నారు.

BRS Plan For Telangana Assembley Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికలను ఎదుర్కొనేందుకు వంద రోజుల ప్రణాళిక రూపొందించారని తెలియజేశారు. జులై 15 నుంచి 31 వరకు కనీసం 30 వేల మందిని వ్యక్తిగతంగా కలిసి సమస్యలు తెలుసుకుంటారని అన్నారు. ప్రతి నెల 'టిఫిన్​ బైఠక్​' పేరుతో భోజనం చేస్తారని వెల్లడించారు. ఈ నెల 16న 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో టిఫిన్​ బైఠక్​ నిర్వహిస్తారని పేర్కొన్నారు. మానవ సంబంధాలు, కార్యకర్తల ఆత్మీయతను ఈ కార్యక్రమం పెంపొందిస్తుందని అన్నారు. రాష్ట్రంలో 17 పార్లమెంట్​లో మోదీ, అమిత్​ షా, జేపీ నడ్డా పర్యటించనున్నారని తెలిపారు. అసెంబ్లీ కేంద్రంగా బహిరంగ సభలు నిర్వహించి.. కేసీఆర్ వైఫల్యాలను ప్రజలకు తెలిసేలా చేస్తామని అన్నారు. నవయువ ఓటర్లు కొత్తగా గుర్తింపు కార్డుకి నమోదు చేయించి.. వారితో సమావేశాలు నిర్వహిస్తామని వివరించారు. ప్రతి పది రోజులకు ఒక అంశం మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తారని ధ్వజమెత్తారు.

"రాబోయే ఎన్నికలను ఎదుర్కొవడానికి 100 రోజుల ప్రణాళికను రూపొందించాం. కుటుంబ పాలనను గద్దె దించి.. బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యచరణ తయారు చేశాం. ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ.. ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేపట్టనున్నాం. జులై 15 నుంచి 31 వరకు కనీసం 30 వేల మందిని వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలను తెలుసుకుంటాం."- కె.లక్ష్మణ్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు

ఇవీ చదవండి :

Last Updated : Jul 11, 2023, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.