ETV Bharat / state

'ఆ రైతులకు బోనస్ ఇవ్వాలి.. అందుకు ప్రశాంత్​రెడ్డి చొరవ తీసుకోవాలి' - MP Arvind latest news

MP Arvind on Turmeric Farmers: రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి పసుపు రైతులను ఆదుకోవాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్​ చేశారు. ఏపీలో ఇచ్చినట్లు బోనస్ ఇవ్వాలని.. ఈ విషయంలో మంత్రి ప్రశాంత్​రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. మార్కెట్​లో క్వింటాల్​ పసుపునకు లభిస్తున్న ధర అన్నదాతలకు ఏమాత్రం సరిపోవడం లేదని తెలిపారు.

MP Dharmapuri Arvind
MP Dharmapuri Arvind
author img

By

Published : Jan 23, 2023, 5:16 PM IST

MP Arvind on Turmeric Farmers : తెలంగాణలో గత వానాకాలం సీజన్​లో అకాల వర్షాలు, అధిక వానల వల్ల 70 శాతం పసుపు పంటలు దెబ్బతిన్నాయని బీజేపీ నేత, నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఆరోపించారు. రాష్ట్రంలో పసుపు పంట దెబ్బతిన్నా బీమా సదుపాయం లేదని.. ప్రధానమంత్రి ఫసల్​ బీమా యోజన (పీఎంఎఫ్​బీవై) అమలుకు నోచుకోకపోవడంతో పసుపు రైతులకు పరిహారం అందడం లేదని పేర్కొన్నారు. మార్కెట్‌లో ఉన్న పసుపు క్వింటాల్ ధర రూ.6 నుంచి రూ.7,500.. అన్నదాతలకు ఏమాత్రం గిట్టుబాటు కాదని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్​లోని పార్టీ కార్యాలయంలో అర్వింద్ మాట్లాడారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి పసుపు రైతులను ఆదుకోవాలని అర్వింద్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందా అంటే అదీ లేదని విమర్శించారు. ఈ అంశంపై లోక్‌సభలో‌ ప్రస్తావిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ప్రతిపాదన రాలేదని సమాధానం వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పసుపు రైతులకు ఎలా సహాయం చేస్తారో చెప్పాలని డిమాండ్​ చేశారు. ఏపీలో ఇచ్చినట్లు పసుపు రైతులకు బోనస్ ఇవ్వాలని.. ఈ విషయంలో మంత్రి ప్రశాంత్​రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు.

రాష్ట్రంలో పసుపు పంట దెబ్బతిన్నా బీమా సదుపాయం లేదు. గత వానా కాలం సీజన్‌లో అకాల వర్షాలు, అధిక వానల వల్ల 70 శాతం పసుపు పంటలు దెబ్బతిన్నాయి. పీఎంఎఫ్​బీవై అమలుకు నోచుకోకపోవడంతో పసుపు రైతులకు బీమా పరిహారం అందడం లేదు. మార్కెట్‌లో పసుపు క్వింటాల్ ధర రూ.6 వేల నుంచి రూ.7,500గా ఉంది. ఆ ధరలు ఏ మాత్రం సరిపోవు. రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోవాలి. ఏపీలో ఇచ్చినట్లు పసుపు రైతులకు బోనస్ ఇవ్వాలి. ఈ విషయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి చొరవ తీసుకోవాలి. - ధర్మపురి అర్వింద్​, నిజామాబాద్​ ఎంపీ

ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ దావోస్​ పర్యటనపైనా ఎంపీ అర్వింద్ స్పందించారు. ప్రతి ఏటా కేటీఆర్ దావోస్ వెళతారని.. ఈ 9 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా అని ప్రశ్నించారు. సంపాదించినదంతా యూరప్‌లో పెట్టుబడులు పెట్టడానికే కేటీఆర్ వెళుతున్నారని అర్వింద్​ విమర్శించారు.

ప్రతి ఏటా కేటీఆర్ దావోస్ వెళతారు. ఈ 9 ఏళ్లలో ఒక్క పరిశ్రమనైనా రాష్ట్రానికి తెచ్చారా. సంపాదించిందంతా యూరప్‌లో పెట్టుబడులు పెట్టడానికి కేటీఆర్ వెళుతున్నారు. - ఎంపీ ధర్మపురి అర్వింద్

ఇవీ చూడండి..

డబుల్ బెడ్​రూమ్​ ఇళ్లపై పేదలు ఆశలు వదులుకోవాల్సిందే: ఎంపీ అర్వింద్

జాబ్ లేదు.. వీసా టైమ్​ ఆగదు.. 60 రోజులే గడువు​.. అమెరికాలో మనోళ్లపై మాంద్యం పిడుగు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.