కేరళ రాష్ట్రం తరహాలో మన రాష్ట్రంలో కూడా ఎన్.పీ.ఆర్‌ను అమలు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. ఎన్.పీ.ఆర్ అమలు చేయకుంటే ఎన్.ఆర్.సీ కూడా ఆగిపోతుందని ఆయన తెలిపారు. మాసబ్ ట్యాంక్‌లో సీఏఏ, ఎన్.ఆర్.సీ, ఎన్.పీ.ఆర్కు వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగసభలో అసదుద్దీన్ ఒవైసీతో పాటు పలు ప్రజాసంఘాల నేతలు, మహిళాసంఘాల నేతలు పాల్గొన్నారు.
ఎన్.పీ.ఆర్‌ను నిలిపివేయాలని సీఎం కేసీఆర్‌ను, హోంమంత్రి మహమూద్ అలీని కలుస్తామన్నారు. మంత్రివర్గ సమావేశంలో సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడంపట్ల తెరాస ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు అసదుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి : నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానంతో 'అగ్రిటెక్'