ఇవీ చూడండి:ఏడు లోక్సభ సెగ్మెంట్లపై తెరాస నజర్
'మా' లో రాజకీయాలు వద్దు..!
రాజకీయ పార్టీల్లో ఆరోపణలు, విమర్శలు సర్వసాధారణం. కానీ...సినీ నటీనటుల సంఘం ఎన్నికలు కూడా అంతే రసవత్తరంగా మారుతున్నాయి. కొత్తగా ఎన్నికైన పాలకవర్గం...పాత ప్యానెల్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
కలిసి పని చేద్దాం రండి..!
సినీ నటీనటుల సంఘానికి జరిగిన ఎన్నికలకు రీకౌంటింగ్ జరపాలని మాజీ అధ్యక్షుడు శివాజీరాజా కుట్ర చేస్తున్నారని నూతన అధ్యక్షుడు నరేశ్ఆరోపించారు. అసోసియేషన్ బాధ్యతలు స్వీకరించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారన్న నరేశ్...ఆలస్యమైతే అర్హులైన లబ్ధిదారులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. 'మా' అనేది స్వచ్ఛంద సంస్థ అని...దాన్ని రాజకీయం చేయవద్దన్నారు. గొడవలు లేకుండా అందరు సమష్టిగా పని చేసేందుకు ముందుకు రావాలని కోరారు.
ఇవీ చూడండి:ఏడు లోక్సభ సెగ్మెంట్లపై తెరాస నజర్