Chestha attack: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతంలో గత కొద్ది రోజులుగా అడవి జంతువుల బెడద అధికమైంది. పలుచోట్ల పశువులు, మేకలపై చిరుత దాడి చేస్తోంది. మరో వైపు ఎలుగుబంట్లు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వివిధ సంఘటనలల్లో ప్రజలను గాయపరిచిన ఘటనలు అధికమవుతున్నాయి. తాజాగా కంబదూరు మండలం జల్లిపల్లి గ్రామంలో ఎర్రప్పఅనే రైతుకు చెందిన స్థలంలో కట్టి ఉంచిన ఆవు దూడపై చిరుత దాడి చేసి తినేసింది.
మరోవైపు పరమసముద్రం మండల కేంద్రంలో పాడుబడిన ఇంట్లో ఎలుగుబంటి తిష్ట వేసింది. దానిని గుర్తించిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కళ్యాణదుర్గం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు.. ఆ ఎలుగుబంటి విశ్రాంతి కోసం ఆ ఇంట్లోకి ప్రవేశించి ఉంటుందని తెలిపారు. తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపిస్తామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: