Mother Kills Her Daughter in Hyderabad : నాలుగేళ్ల చిన్నారి నిద్రపోయి.. మళ్లీ కళ్లు తెరవలేదు. ఎందుకని ఆసుపత్రికి తీసుకువెళ్తే.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. పాప అనుమానాస్పద మృతి పట్ల చిన్నారి తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విస్తురుపోయే విషాయాన్ని బయటపెట్టారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు ఒక్కసారిగా కంగుతిన్నారు. అదేంటో చూద్దాం..!
Kushaiguda 4 Years Girl Death Case : హైదరాబాద్ కుషాయిగూడకు చెందిన నాయకవాడి రమేశ్, కల్యాణి ఐదేళ్ల క్రితం ప్రేమ విహహం చేసుకున్నారు. వీరికి తన్విత అనే నాలుగేళ్ల పాప ఉంది. వృత్తిరీత్యా రమేశ్.. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భర్త మద్యం సేవిస్తున్నాడనే కారణంతో.. రెండేళ్ల క్రితం కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. దీంతో విసిగించిన కల్యాణి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి బిడ్డతో కలిసి ఆమె పుట్టింట్లో నివాసం ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ.. యాక్టీవ్‌గా ఉండే కల్యాణికి ఆన్‌లైన్‌లో గత ఏడాది తన దూరపు బంధువైన ఇండ్ల నవీన్ పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం.. వివాహేతర బంధానికి దారితీసింది.
Mother Killed her Daughter : నవీన్-కల్యాణి బంధాన్ని కొనసాగించేందుకు పాప తన్విత అడ్డుగా ఉందని భావించారు. ఈ క్రమంలోనే చిన్నారిని అడ్డు తొలగించుకోవాలని భావించి.. ఎవరికీ అనుమానం రాకుండా హత్య చేసేందుకు ప్రణాళిక రచించారు. ఈ నెల 1వ తేదీన పాఠశాలకు వెళ్లిన తన్విత మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. ఇదే సమయంలో ఇంట్లో ఉన్నవారు బయటికి వెళ్లగా అదును చూసిన కల్యాణి.. చిన్నారి నిద్రిస్తుండగా దిండుతో ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసింది. ఎవరికీ అనుమానం రాకుండా తన పాప చనిపోయిందంటూ నటించింది.
"కల్యాణి భర్తతో గత రెండేళ్లుగా దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో దూరపు బంధువైన ఇండ్ల నవీన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర బంధానికి దారితీసింది. దీంతో వారు పెళ్లి చేసుకుందాం అని నిర్ణయానికి వచ్చారు. దానికి నవీన్-కల్యాణి చిన్నారిని అడ్డుగా భావించారు. నెలరోజులుగా వారు ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. కల్యాణి ఇంట్లో ఎవరులేని సమయం చూసి నవీన్‌కి ఫోన్ చేసి.. ఇవాళ చంపేస్తున్న అని చెప్పింది. అతను కూడా దానికి సరే అన్నాడు." -ప్రవీణ్‌కుమార్, కుషాయిగూడ సీఐ
పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి : బిడ్డ చనిపోయినట్లు తెలుసుకున్న రమేశ్.. అత్తారింటికి వెళ్లాడు. పాప మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన్‌కాల్స్, తన్విత పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారణ జరపగా.. కల్యాణి-నవీన్ వివాహేతర బంధం బయటపడింది. వీరిద్దరి బంధానికి అడ్డుగా ఉందని పాపను కల్యాణే హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు.. ఇద్దరినీ అరెస్టు చేశారు. కన్నపేగునే కనికరం లేకుండా కడతేర్చిన కల్యాణి కసాయితనం తెలిసి స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: