ETV Bharat / state

విషాదం నింపుతున్న ఆదివారం... ఇదే రోజున జల ప్రమాదాలు

author img

By

Published : Sep 16, 2019, 7:57 AM IST

వారంతం విషాదం నింపుతోంది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద నిన్న జరిగిన బోటు ప్రమాదం సహా గతంలోనూ ఇలాంటి ఘటనలు ఆదివారం రోజునే జరిగాయి.

విషాదం నింపుతున్న ఆదివారం... ఇదే రోజున జల ప్రమాదాలు

ఏపీ తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాదం పలువురు పర్యాటకుల ప్రాణాలను బలిగొంది. వారాంతపు సెలవుదినం కావడంతో విహారానికి వెళ్లిన వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తెలుగు రాష్ట్రాల ప్రజలను ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆదివారం కాస్తా విషాదాదివారంగా మారింది. ఈ ఒక్క ఘటనే కాదు.. గతంలో జరిగిన పడవ బోల్తా ఘటనలూ ఆదివారమే జరగడం గమనార్హం. కృష్ణా, గోదావరి నదుల్లో గతంలో జరిగిన ఘటనలు చూస్తే ఈ విషయం అవగతమవుతోంది.

  • విజయవాడ సమీపంలో పవిత్ర సంగమం 2017 నవంబర్‌ 12న కార్తిక మాసం సందర్భంగా నెల్లూరు, ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన భక్తులు బోటులో ప్రయాణిస్తుండగా అది బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది చనిపోయారు.
  • 2018 జులైలో తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో లాంచీ తిరగబడటంతో 15 మంది మృతి చెందారు.

ఇవీచూడండి: ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గోదావరిలో గల్లంతు

Intro:ap_atp_63_15_gramsthula_dharna_av_ap10005
________:_______*
పోటాపోటీ ధర్నాలతో ఉద్రిక్తత....
------------*
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని బోరంపల్లి గ్రామంలో మొహరం వేడుకల సందర్భంగా జరిగిన వివాదాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మొహరం సందర్భంగా గ్రామంలో ఓ వర్గం వారు దళితులను కించపరిచారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికి మద్దతుగా పలు ప్రజా సంఘాలు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కూడా నిర్వహించారు. అయితే తమ వర్గం వారిని అనవసరంగా రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ మరో వర్గం వారు ఆదివారం రాత్రి కళ్యాణదుర్గం -అనంతపురం ప్రధాన రహదారిపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దీంతో రహదారిపై భారీగా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేయగా ధర్నా చేస్తున్న మహిళలు గ్రామంలోని యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగి తమకు న్యాయం చేసే వరకు ఆందోళన చేపడతామని భీష్మించారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.