ETV Bharat / state

ఆదివారం కరోనా పరీక్షలకు ఆటంకం.. మూడొంతుల కేంద్రాల మూత - హైదరాబాద్ కరోనా వార్తలు

ఆదివారం కరోనా పరీక్ష కేంద్రాలు చాలా వరకు పనిచేయడం లేదు. ప్రధాన ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో తప్ప ఇతర కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడం లేదు. తొలుత బాగానే చేసినా, నెల రోజుల క్రితం నుంచే ఆదివారం పరీక్షలు చేయడం తగ్గించేశారు. ఈ ప్రభావం మరుసటిరోజుపై పడుతోంది. సోమవారం పరీక్ష కేంద్రాల వద్ద అనుమానితులు బారులు తీరుతున్నారు.

coronavirus
coronavirus
author img

By

Published : Aug 9, 2020, 8:40 AM IST

హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన కుటుంబంలోని ముగ్గురిలో ఇద్దరు జ్వరంతో బాధపడుతున్నారు. పరీక్షలకని శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లు అయిపోయామని, మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు చేశారు. ఫలితం 12వ తేదీ వస్తుందని తెలిపారు. జ్వరం తగ్గకపోతుండడం, పరీక్ష ఫలితం తెలిసిన వెంటనే వైద్యం చేయించుకుందామని భావించిన ఆ కుటుంబం ఇప్పుడేం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోంది. ఆదివారం మరోమారు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షకు వెళదామంటే నగరంలో మూడొంతులకు పైగా పరీక్ష కేంద్రాలు మూతపడుతున్నాయని తెలిసి మళ్లీ ఆందోళనలో పడింది.

ఆదివారం వస్తోందంటే భాగ్యనగరంలో కరోనా అనుమానితులు వణికిపోతున్నారు. కారణం ఆ రోజు పరీక్ష కేంద్రాలు చాలా వరకు పనిచేయకపోవడమే. ప్రధాన ఆసుపత్రులు ఏరియా ఆసుపత్రుల్లో తప్ప ఇతర కేంద్రాల్లో పరీక్షలు చేయడంలేదు. తొలుత బాగానే చేసినా, నెల రోజుల క్రితం నుంచే ఆదివారం పరీక్షలు చేయడం తగ్గించేశారు. మిగిలిన రెండు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. మేడ్చల్‌ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా మూడు రోజులకు ఒకసారి మాత్రమే నమూనాలు తీసుకుంటుండడంపై స్థానికులు విమర్శలు చేస్తున్నారు.

మరుసటి రోజుపై ప్రభావం

ఆదివారం ప్రభావం మరుసటి రోజుపై పడుతోంది. సోమవారం వేలాది మంది అనుమానితులు పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఇప్పటికే గ్రేటర్‌లో జనాభా సంఖ్యకు అనుగుణంగా కేంద్రాలు లేవన్న విమర్శలున్నాయి. పరీక్షలు పెంచాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల నమూనాలు సేకరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. తదనుగుణంగా వైద్య ఆరోగ్య శాఖ స్పందించకపోవడంపై విమర్శలు రేగుతున్నాయి.

అటు సిబ్బంది కొరత.. ఇటు ఫలితాల్లో అస్పష్టత

ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత ప్రభావం పరీక్షల నిర్వహణపై పడుతోంది. చర్లపల్లి, కుషాయిగూడ, నాగోలు యూపీహెచ్‌సీల్లో ల్యాబ్‌ టెక్నీషియన్ల కొరత అధికంగా ఉంది. కీసర వైద్యాధికారి పరిధిలోని 16 పీహెచ్‌సీలకు గాను నాలుగింటిలో ల్యాబ్‌ టెక్నీషియన్ల కొరత ఉంది. ఉప్పల్‌ నియోజకవర్గం పరిధిలోని 15 బస్తీ దవాఖానాలు, మల్కాజిగిరి నియోజకవర్గంలోని 7 బస్తీ దవాఖానాల్లో సిబ్బంది కొరత వల్ల యాంటీజెన్‌ పరీక్షలే మొదలు కాలేదు. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు చేయించుకున్న వారికి కొన్ని చోట్ల వెంటనే మరికొన్ని చోట్ల సాయంత్రానికి ఫలితం చెప్పేస్తున్నారు. అదే ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు చేయించుకుంటే ఫలితం రావడానికి 3-4 రోజుల సమయం పడుతోంది. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండి, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు చేయించుకున్న వారిలో పలువురికి నెగెటివ్‌ వస్తోంది. వారంతా ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలకు పరుగులు తీస్తున్నారు. ఆ పరీక్ష ఫలితం ఆలస్యంగా వస్తుండడం బాధితుల్లో ఆందోళన పెంచుతోంది. అటు సిబ్బంది కొరత, ఇటు పరీక్ష ఫలితాల్లో అస్పష్టత లోపాలను తక్షణం సరిదిద్దాలని నిపుణులు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.