ETV Bharat Morning walk and Solution program : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సమస్యల పరిష్కారానికి ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో... ఉదయం నడక- పరిష్కార బాట పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా... రామంతాపూర్ డివిజన్ పరిధిలో స్థానిక కార్పొరేటర్ శ్రీవాణి... అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. సీసీ రోడ్డు, డ్రైనేజీ వంటి సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయంటూ స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తెచ్చారు.
కార్పొరేటర్ కాలనీకి వచ్చారనే సమాచారంతో కాలనీవాసులు తరలివచ్చారు. పైపులైన్ లీకేజీ, తాగునీటి ఎద్దడి, అపరిశుభ్రత, నీటిలో వస్తున్న పురుగుల గురించి వివరించారు. కాలనీలో మురుగునీటి కాల్వ పూడుకుపోయి... దారి తప్పిన మురుగనీటి ప్రవాహం, వర్షాకాలంలో తమ ఇళ్లను ముంచెత్తి ప్రమాదకరంగా మారిందని కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు.
శ్రీనగర్ కాలనీలో గుర్తించిన సమస్యలకు అధికారులతో కలిసి పరిష్కారాలు చూపించారు. ఈటీవీ భారత్-ఈనాడు చేపట్టిన కార్యక్రమంలో పాల్గొని సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందని కార్పొరేటర్ బండారు శ్రీవాణి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: CM KCR Mumbai Tour: ముంబయిలో కేసీఆర్.. మహారాష్ట్ర సీఎంతో లంచ్ భేటీ..