ETV Bharat / state

Voter List 2021 Telangana: రాష్ట్రంలో కొత్తగా చేరిన ఓటర్ల సంఖ్య ఎంతంటే..?

ఏడాది కాలంలో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య లక్షా 91 వేలు పెరిగింది. కొత్తగా 2లక్షల 84 వేల పేర్లు జాబితాలో(voter list 2021 telangana) చేరగా... 92వేల పేర్లు తొలగించారు. అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6 లక్షల 61వేల మంది ఓటర్లుండగా... అత్యల్పంగా భద్రాచలం నియోజకవర్గంలో కేవలం లక్షా 42వేల మంది ఓటర్లున్నారు. మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 65 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది.

voter list 2021 telangana. telangana voters list
తెలంగాణ ఓటర్ల జాబితా, కొత్త ఓటర్ల జాబితా 2021
author img

By

Published : Nov 3, 2021, 7:40 AM IST

ఎన్నికల సంఘం ప్రకటించిన తాజా ముసాయిదా జాబితా(voter list 2021 telangana) ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,03, 56,665. అందులో పురుషులు 1,52,57,690 మంది కాగా... మహిళల సంఖ్య 1,50,97,292. ఇతరులు 1683 మంది జాబితాలో ఉన్నారు. నిరుటి జాబితాతో(voter list 2021 telangana) పోలిస్తే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 1,91,096 పెరిగింది. 2021 జనవరి 15న ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం అప్పట్లో రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య 3,01,65,569. కొత్తగా 2,84,030 మంది పేర్లు జాబితాలో చేరగా జాబితా నుంచి వివిధ కారణాల వల్ల 92,934 మంది పేర్లు తొలగించారు. అత్యధికంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 28,935 మంది ఓటర్లు పెరిగారు. కుత్బుల్లాపూర్‌లో 16,367, ఖమ్మంలో 10,938, హుజూరాబాద్‌లో 10,458, ఉప్పల్‌లో 10,406 ఓటర్ల సంఖ్య పెరిగింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో 4,335 ఓట్లు తొలగించారు. నర్సంపేటలో 3,805... కోదాడలో 3,434... మేడ్చల్​లో 3,141... ఆర్మూర్​లో 2,855 ఓట్లను తొలగించారు.

నియోజకవర్గాల వారీగా చూస్తే మొదటి పది స్థానాలు...

  • శేరిలింగంపల్లి- 6,61,798 మంది
  • కుత్బుల్లాపూర్- 6,25,538 మంది
  • మేడ్చల్- 5,63,946 మంది
  • ఎల్బీనగర్- 5,54,121 మంది
  • ఉప్పల్- 5,04,504 మంది
  • రాజేంద్రనగర్‌- 4,98,825 మంది
  • మహేశ్వరం- 4,85,900 మంది
  • మల్కాజిగిరి- 4,53,038 మంది
  • కూకట్‌పల్లి- 4,35,533 మంది
  • యాకుత్​పురా- 3,43,959 మంది

రాష్ట్రంలో అత్యల్పంగా భద్రాచలం నియోజకవర్గంలో కేవలం 1,42,670 మంది ఓటర్లున్నారు(voter list 2021 telangana). అశ్వరావుపేటలో 1,46,648... బెల్లంపల్లిలో 1,61,687... చెన్నూరులో 1,75,292... వైరాలో 1,79,642 ఓటర్లున్నారు. రాష్ట్రంలో రెండు లక్షల్లోపు ఓటర్లున్న నియోజకవర్గాలు 10 ఉండగా... రెండు నుంచి మూడు లక్షల్లోపు ఓటర్లున్న నియోజకవర్గాలు 91 ఉన్నాయి. మూడు నుంచి నాలుగు లక్షల్లోపు ఓటర్లున్న నియోజకవర్గాలు 9 ఉన్నాయి. నాలుగు నుంచి ఐదు లక్షల్లోపు ఓటర్లున్న నియోజకవర్గాలు 4 ఉండగా... ఐదు నుంచి ఆరు లక్షల్లోపు ఓటర్లున్న నియోజకవర్గాలు 3 ఉన్నాయి. రెండు నియోజకవర్గాల్లో 6 లక్షలకు పైగా ఓటర్లున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 65 నియోజకవర్గాల్లో పురుషుల కంటె మహిళలే అధికంగా ఉన్నారు.

ఈ నెలాఖరు వరకు అభ్యంతరాలు

ముసాయిదా జాబితాపై ఈ నెలాఖరు వరకు అభ్యంతరాలు, విజ్ఞప్తులు స్వీకరిస్తారు. ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం డిసెంబర్ ఆరు వరకు గడువు ఇచ్చారు. వాటన్నింటిని పరిష్కరించి 2022 జనవరి 5న ఓటర్ల(voter list 2021 telangana) తుదిజాబితాను ప్రకటిస్తారు. 2022 జనవరి ఒకటో తేదీ వరకు 18 ఏళ్లు పూర్తయిన ప్రతీ ఒక్కరు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 6,7, 27, 28 తేదీల్లో ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతారు.

ఇదీ చదవండి: Huzurabad Bypoll Results: భాజపా-తెరాస హోరాహోరీ పోరులో.. వికసించిన కమలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.