ETV Bharat / state

పాఠశాలల్లో విజృంభిస్తున్న కరోనా.. రెండ్రోజుల్లో 150కి పైగా కేసులు‌ - తెలంగాణ పాఠశాలల్లో కరోనా కేసులు

రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో కరోనా కలవరపెడుతోంది. వివిధ జిల్లాల్లోని బడుల్లో రెండు రోజుల వ్యవధిలో 150 మందికి పైగా విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధరించారు. వైరస్‌ వ్యాప్తితో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎలాంటి భయమూ వద్దని ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది.

More than 150 corona positive cases in two days in telangana
రెండు రోజుల్లో 150 మందికి పైగా కరోనా కేసులు‌
author img

By

Published : Mar 19, 2021, 8:45 PM IST

Updated : Mar 19, 2021, 8:51 PM IST

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తున్న వేళ.. కరోనా వ్యాప్తి తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. రెండు రోజుల్లోనే 150 మందికి పైగా విద్యార్థులు వైరస్‌ బారిన పడ్డారు. శుక్రవారం ఒక్కరోజే ఇప్పటివరకు 100 మందికి పైగా పాజిటివ్‌గా నిర్ధరించారు. మంచిర్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రెండు రోజుల్లో 29 మంది విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చింది. నిర్మల్‌ జిల్లా భైంసాలోని జ్యోతిబాపులే బాలుర గురుకులంలో 176 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా ఏకంగా 25 మందికి వైరస్‌ సోకింది. ఆదిలాబాద్‌లో జిల్లాలో వివిధ ప్రభుత్వ బడుల్లో నిర్వహించిన పరీక్షల్లో 35మంది విద్యార్థులతోపాటు మరో 21 మంది ఉపాధ్యాయులకు పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది.

వంటమనిషి సహా

జగిత్యాలలో బాలికల గురుకుల పాఠశాలలో 200 మంది విద్యార్థులు చదువుతుండగా.. 17 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులు వైరస్‌ బారినపడ్డారు. 20 మంది విద్యార్థినులకు జ్వరం రాగా.. వైద్యశిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట కస్తూర్బా పాఠశాలలోనూ.. 60 మందికి పరీక్షలు నిర్వహించగా.. 15 మందికి కరోనా నిర్ధరణ అయింది. యాదాద్రి తుర్కపల్లి పాఠశాలలో 12 మందికి పాజిటివ్‌గా నిర్ధరించారు. రాజేంద్రనగర్‌ ఎస్టీ బాలుర వసతి గృహంలో 92 మందికి పరీక్షలు నిర్వహించగా.. 22 మంది విద్యార్థులకు వైరస్‌ సోకినట్లు తేల్చారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ బాలుర గురుకుల పాఠశాలలో వంటమనిషి సహా ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో.. 18 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి కరోనా సోకింది.

పరీక్షలు యథాతథం

ఉస్మానియా విశ్వవిద్యాలయ వసతిగృహంలో ఇద్దరు పీజీ విద్యార్థినిలకు కరోనా సోకింది. వసతిగృహంలో మొత్తం 400 మంది ఉంటున్నారు. శనివారం నుంచి మూడో సెమిస్టర్‌ పరీక్షలు ఉన్నందున.. అందరికీ వైద్య పరీక్షలు చేశాకే.. నిర్వహించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధికారులు మాత్రం పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కరోనా సోకిన వారికి తర్వాత పరీక్షలు ఉంటాయని.. వారిని సప్లిమెంటరీగా పరిగణించమని తెలిపారు. అందరికీ పరీక్షలు నిర్వహించాల్సిందేనంటూ విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

జాగ్రత్తలు తీసుకుంటున్నాం

జిల్లా అధికారులు విద్యార్థుల పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వైరస్‌ సోకిన వారిని ప్రత్యేకంగా ఉంచి వైద్యం అందిస్తున్నారు. హన్మకొండలో పలు ప్రభుత్వ బడులను సందర్శించిన చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌... అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. ఆందోళన చెందొద్దని సూచించారు.

పాఠశాలల్లో కరోనా కేసులు నమోదు అవుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి : 82 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పాజిటివ్​

Last Updated : Mar 19, 2021, 8:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.