గ్రేటర్ పరిధిలోని 30 డేకేర్ కేంద్రాల్లో ఈ నెల 14న సీనియర్ సిటిజన్లకు నిర్వహించే క్రీడా పోటీలపై జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జలమండలి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో యు.సి.డి. విభాగం ప్రాజెక్ట్ అధికారులు, ఆసరా కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంపిక చేసిన 30 డేకేర్ కేంద్రాల్లో వారానికి మూడు రోజులు ప్రత్యేకంగా యోగా నిర్వహించేందుకు శిక్షకులను నియమిస్తామని దానకిశోర్ పేర్కొన్నారు. ఫిజియో థెరపిస్ట్లను నియమించడమే కాకుండా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు పాలియేటివ్ కేర్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించారు. దీనికోసం ప్రత్యేకంగా నాలుగు వాహనాలు కేటాయించనున్నట్లు వివరించారు. ఈ కేంద్రాల్లో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక తేదీల్లో డాక్టర్లు అందుబాటులో ఉంటారన్నారు.
ఇదీ చూడండి: పెట్రోల్ బంక్ నుంచి నీరు.. ప్రయోగశాలకు నమూనాలు