కరోనా బాధితుల్లో 21-60 ఏళ్ల లోపు వారే ఎక్కువ శాతం మంది ఉంటున్నారు. మరీ ముఖ్యంగా గ్రేటర్‌లో యువత, నడి వయస్కులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బయటకు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
గడిచిన 24 గంటల్లో గ్రేటర్‌లో 298 మంది కరోనా బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 172 మంది, మేడ్చల్ జిల్లాలో 176 మందిని పాజిటివ్‌లుగా నిర్ధారించారు. 'గాంధీ'తోపాటు ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 11 మంది మృతి చెందారు.
ఇదీ చదవండిః కరోనా బాధితులకు పండ్ల పంపిణీ చేసిన జడ్పీ ఛైర్మన్