ETV Bharat / state

'ఉస్మానియా'కు పరిమితికి మించి మృతదేహాలు! - హైదరాబాద్​ తాజా వార్తలు

ఉస్మానియా ఆసుపత్రి శవాగారానికి ఇటీవలి కాలంలో మృతదేహాల తాకిడి అధికమైంది. సామర్థ్యానికి మించి మృతదేహాలు తీసుకువస్తుండటంతో స్థలం సరిపోక ఇబ్బందులు తప్పడం లేదు. గత్యంతరం లేని స్థితిలో శవాల గదిలోని స్ట్రెచర్లపైనే సిబ్బంది వాటిని భద్రపరుస్తున్నారు.

osmania hospital
osmania hospital
author img

By

Published : Aug 10, 2020, 9:57 AM IST

హైదరాబాద్​ గాంధీ ఆసుపత్రిని’ని ప్రభుత్వం పూర్తి స్థాయి కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చేయడంతో అక్కడ పోస్టుమార్టం ప్రక్రియ నిలిపివేశారు. ప్రత్యామ్నాయంగా ఉన్న ఉస్మానియా శవాగారంలోనే రెండు ఆసుపత్రులకు సంబంధించిన మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తున్నారు. నిత్యం ఉస్మానియా పరిధిలో 12 నుంచి 15, గాంధీ ఆసుపత్రి నుంచి వచ్చిన 10 నుంచి 12 (రెండు కలిపి దాదాపు 30) మృతదేహాలకు ఉస్మానియా, గాంధీ ఫోరెన్సిక్‌ వైద్యులు ఇక్కడే వేర్వేరుగా పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. సుమారు 3 నెలలుగా ఉస్మానియా మార్చురీలోనే వేర్వేరుగా మృతదేహాలకు మరణోత్తర పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా నిర్ధారణ అయిన మృతదేహాలను నల్లటి సంచుల్లో చుట్టి ఏసీ గదిలో పెట్టిన అనంతరం జీహెచ్‌ఎంసీ సిబ్బందికి అప్పగిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, కాలిన గాయాలు, ఆత్మహత్యలకు సంబంధించిన మృతదేహాలకు ఫోరెన్సిక్‌ వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్షల అనంతరం, పోలీసులు మెడికో లీగల్‌ కేసులుగా నమోదు చేసి వారి కుటుంబికులకు అప్పగిస్తున్నారు. వీటికితోడు అనాథ శవాల సంఖ్య సైతం ఇటీవల పెరిగింది.

సామర్థ్యానికి మించి...

ఉస్మానియా శవాగారంలో మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్‌ బాక్సులు 30 ఉన్నాయి. వీటిలో కొన్ని పని చేయడం లేదని తెలిసింది. నిత్యం 30కి పైగా మృతదేహాలను తీసుకువస్తుండటంతో ఫ్రీజర్‌ బాక్సుల్లో భద్రపర్చే అవకాశం లేక ఇష్టానుసారంగా స్ట్రెచర్లపైనే వదిలేస్తున్నారు. దీంతో విపరీతమైన దుర్వాసన వ్యాపిస్తోంది. పోస్టుమార్టం పూర్తయ్యాక శవాలను శుభ్రం చేసి తెల్లని వస్త్రంలో చుట్టి ఇచ్చేందుకు మార్చురీ సిబ్బంది మృతుల కుటుంబికుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపించారు. సుమారు రూ.800 నుంచి 1300 వరకు వసూలు చేస్తున్నారని, గత్యంతరం లేని పరిస్థితిలో ఇవ్వాల్సి వస్తోందని వాపోయారు. కొవిడ్‌ నేపథ్యంలో ఉపాధి కరవై.. ఆప్తుల్ని కోల్పోయి కొండంత దుఃఖంలో ఉన్న వారిని మానవతాదృక్పథంతో ఆదుకోవాల్సింది పోయి, డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మృతదేహాలపై కప్పేందుకు తెల్లని వస్త్రాలను ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయాలని, మార్చురీలో వసూళ్ల పర్వం లేకుండా చూడాలని మృతుల కుటుంబికులు కోరారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం

‘గాంధీ’ని పూర్తిస్థాయి కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చిన నేపథ్యంలో అక్కడి మృతదేహాలను కూడా ‘ఉస్మానియా’కు తీసుకురావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికి పరిష్కారం దిశగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.నాగేందర్‌ ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు చెందిన ఫోరెన్సిక్‌ విభాగాధిపతులతో ఇటీవల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకువెళ్తాం. - డా.శ్రీకాంత్‌, డ్యూటీ ఆర్‌ఎంఓ

ఇదీ చదవండి: కాంగ్రెస్​ వర్గీయుల బాహాబాహీ.. ఒకరిపై ఒకరి కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.