హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హిమాయత్ సాగర్లోని 12 గేట్లు ఎత్తివేశారు. మూసీనది పొంగి పొర్లుతుంది. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని అంబర్పేట నియోజకవర్గం పరిధి, గోల్నాక డివిజన్, కృష్ణానగర్ ప్రాంత ప్రజల ఇళ్లలోకి నీరు వస్తుందని భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఇప్పటికే పలు కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. రాత్రి నుంచి ఇళ్లలోకి వచ్చిన నీటిని ఎత్తి పోసుకుంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మూసీ నదిపై ఉన్న ముసరాంబాగ్ వంతెన పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ముసరాంబాగ్ నుంచి అంబర్పేట వైపు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదీ చూడండి : ఎల్బీనగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్