అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై ఉంటుందా?
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్‌కు నిసర్గ అని పేరు పెట్టారు. ఈ తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండదు. మహారాష్ట్ర, గుజరాత్‌పై ఎక్కువ ప్రభావం ఉంటుంది. జూన్ రెండో వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందా?
వచ్చే ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయి.
ఈ సంవత్సరం తెలంగాణలో వర్షపాతం ఏ విధంగా ఉంటుంది?
దేశ వ్యాప్తంగా 94 శాతం నుంచి 104 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా. తెలంగాణలో 102 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. జూన్, జులై, ఆగస్ట్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పిడుగులు ఎందుకు పడతాయి. ఎక్కడా పడతాయి?
వర్షాలు కురిసేటప్పుడు క్యుములోనిబంస్ మేఘాలు ఏర్పడతాయి. ఈ మేఘాల్లో స్థిర విద్యుత్ ఏర్పడి పిడుగులు పడతాయి.
ఇదీ చూడండి: సీఎం కేసీఆర్‌కి రైతన్న బహుమానం