Rainy Season Healthy Snacks in Telugu : వర్షకాలంలో మొక్కజొన్న కంకులు బాగా దొరుకుతాయి. వాటిని తెచ్చుకొని చక్కగా కాల్చి కాస్త ఉప్పు, కారం, నిమ్మరసం చేర్చి తింటే ఉంటుంది చూడండి అంతే ఇంకా. ఇది తినడం వల్ల ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్ సి, మెగ్నీషియం వంటి న్యూట్రియంట్లు శరీరానికి అందుతాయి.
Healthy Snacks in Telugu : సాయంకాలం వేళ వేడి వేడి సమోసా, కప్పు అల్లం టీ... ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. నూనెలో బాగా వేగిన సమోసాలు తింటే కెలోరీల సమస్య వస్తుంది కదా..! అచ్చంగా బంగాలదుంపతో చేసినట్టే క్యారెట్, బీట్రూట్, బఠాణీతో చేసుకోవచ్చు. ఏం లేదండి.. క్యారెట్, బీట్రూట్లను చిన్న ముక్కలుగా కోయండి.. బఠాణీసు కోసి పెట్టుకున్న ముక్కలు అన్ని కలిపి ఉడికించండి. వాటికి సన్నగా తరిగిన ఉల్లి, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం చేర్చి సమోసాల వత్తుకోవాలి. పైన పలుచని పొరకి నూనెరాసి , అవెన్‌లో పెట్టేస్తే సరి. ఇలా కాదనుకుంటే ఎయిర్ ఫ్రయర్లో కుక్ చేసుకున్నా మంచిదే. కెలోరీలు తగ్గుతాయి.. శరీరానికి పోషకాలు అందుతాయి.
స్వీట్‌కార్న్‌తో ఎన్నో పోషకాలు: స్వీట్‌కార్న్ తీసుకొని ఉడిగించి గింజలము తీసుకోండి. ఇప్పుడు దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాట, కీర ముక్కలని చేర్చండి. అందులోకి కాస్త ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి కలిపి తినండి. విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిండెంట్లతో ఉన్న స్నాక్ ఇది.
మొలకెత్తినవి ఇలా తినండి సూపర్‌గా ఉంటాయి: సహజంగా అందరు మొలకెత్తిన గింజలను తింటారు కానీ ఈ సారికి ఇలా ట్రై చేయండి. శనగలు, పెసర్లు ఇలా మీకు నచ్చిన రెండు లేదా మూడు రకాల గింజలను నానబెట్టి మొలకెత్తాక అదే నీటిలో వాటిని ఉడికించండి. వీటిలో ఉడికించిన పల్లీలు, టమాట, కీర ముక్కలు వేయండి. దాంట్లోకి సరిపడ ఉప్పు, మిరియాల పొడి చేర్చి తినండి. ఈ స్నాక్ జీర్ణప్రక్రియను సులభతరం చేయడమే కాక శరీరాన్ని ఉల్లాసంగా ఉంచుతుంది.
అటుకులను పోపు వేసి తినడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ దాని వల్ల జరిగే ప్రయోజనం చాలా మందికి తెలిసి ఉండదు. అటుకులను దోరగా వేయించి ఉప్పు, కారం, పల్లీలు చేర్చి తినడం వల్ల ఫైబర్‌తోపాటు కార్బోహైడ్రేట్లు శరీరానికి మెండుగా అందుతాయి. పసుపు, కరివేపాకుతో కలిపి తింటే రుచితోపాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో శరీరానికి ఎంతో ఆరోగ్యకరం.
గుప్పెడు పల్లీలు తీసుకొండి దానిలోకి కొద్ది మొత్తంలో బాదం, జీడిపప్పు కలిపి వేయించండి. ఇప్పుడు జీలకర్ర, పసుపు, దాల్చినచెక్క పొడులతోపాటు కాస్త ఉప్పు కలిపి తింటే సరి. రుచికి రుచి.. ఇంకా హెల్తీ కొవ్వులతోపాటు ప్రొటీన్, మినరల్స్ శరీరానికి అందుతాయి.
ఇవీ చదవండి: