నైరుతి రుతుపవనాల వర్షపాతం రాష్ట్రవ్యాప్తంగా సమతుల్యంగానే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాల వర్షపాతం కాలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణంగానే 96 నుంచి104 శాతం ఉండే అవకాశం ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలో 93 నుంచి 107శాతం వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణకేంద్రం సంచాలకులు కె. నాగరత్న వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం అన్నిచోట్ల సమతుల్యంగానే ఉంటుందని తెలిపారు. కొన్ని చోట్ల సాధారణ వర్షాపాతం కురిసినప్పటికీ... దక్షిణ, ఆగ్నేయ జిల్లాల్లో ఈ ఏడాది కొంత ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: Tamilisai: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్