లాగ్ బుక్ వాడండి
మీరు అధికంగా ఖర్చు చేస్తారా...అయితే ఇది మీకోసమే. కచ్ఛితంగా లాగ్ బుక్ వాడండి. ఎక్కడ నగదు ఎక్కువ ఖర్చు చేస్తున్నారో తెలుసుకొని తగ్గించుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు బుక్‌లో రోజూ వారి ఖర్చులు అప్డేట్ చేయండి. ఇలా చేస్తే మీకు తెలియకుండానే ఆర్థిక అవసరాలపై బాధ్యత పెరుగుతుంది.
పెట్టుబడి
పెట్టుబడి కొందరికి బోరింగ్ అనిపిస్తే.. మరికొందరికి అనవసరం..మీరు ఆర్థికంగా గొప్పగా ఉండాలంటే మాత్రం పెట్టుబడి పెట్టాలనేది నిపుణుల సలహా. 2019లో పెట్టుబడికి ముహూర్తం ఖరారు చేసుకోండి. ఏదైనా పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, ఫిక్స్ డ్ డిపాజిట్ చేయండి. మీరు రిస్క్ కోరుకుంటే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచిది.
ఖర్చులపై ఓ కన్నేయండి
ఎక్కువ పొదుపు చేయాలంటే అనవసరమైన ఖర్చులు తగ్గించాల్సిందే.. ఉదాహరణకు బ్రాండెడ్ వస్తువులపై మోజు తగ్గించుకోండి. బయట భోజనం కాకుండా ఇంట్లోనే చేయాడానికి ప్రయత్నించండి. చిన్న విషయమే అయినా.. పూర్తిగా మీపై ఆధారపడి ఉంటుంది.
క్రెడిట్ కార్డు వాడకం తగ్గించండి
ఓ సమయంలో క్రెడిట్ కార్డు వాడకం బాగానే ఉంటుంది. పొదుపు చేస్తున్నామన్న భావనా కలుగుతుంది. కొంత కాలం తర్వాత అవే మిమ్మల్ని అప్పుల బారిన పడేలా చేస్తాయి. సో క్రెడిట్ కార్డు అవసరమైన మేర మాత్రమే వాడండి.
బోనస్‌లను జాగ్రత్తగా వాడండి
సంవత్సరం చివరలో కొత్త సంవత్సరం సందర్భంగా బోనస్‌లు రావడం సహజం. చాలామంది ఈ డబ్బులను అప్పులు తీర్చడానికి ఉపయోగిస్తారు. అలా కాకుండా దీర్ఘకాలికంగా ఉపయోగపడే ప్రాపర్టీ కొనేలా ప్రణాళిక చేసుకోంది. అది మీకు భవిష్యత్‌లో ఉపయోగపడుతుంది.