కరోనా కట్టడి చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న లాక్డౌన్ కారణంగా ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం బియ్యం, నగదు పంపిణీకి చర్యలు చేపట్టింది. ఇప్పటికే బియ్యం పంపిణీ ప్రారంభమై కొనసాగుతోంది. బియ్యంతో పాటు ఒక్కో కుటుంబానికి రూ. 1500 చొప్పున ఇచ్చేందుకు రూ.1,314 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఆ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమచేస్తున్నారు.
పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్న వివరాలు, ఆధార్ అనుసంధానం ద్వారా 97 శాతం ఆహారభద్రతా కార్డులు కలిగిన వారి బ్యాంక్ ఖాతాల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాల ఆధారంగా బుధవారం నుంచి నగదు పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. మూడు, నాలుగు రోజుల్లో ప్రక్రియ పూర్తయి లబ్ధిదారులు అందరికీ నగదు చేరుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అటు ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, 500 రూపాయల నగదు పంపిణీ కొనసాగుతోంది.
ఇదీ చూడండి : 'ధాన్యం సేకరణపై సమస్యలుంటే సంప్రదించండి'